Rain Alert Today : ఇవాళ తెలంగాణలోని 13 జిల్లాల్లో వానలు

Rain Alert Today : ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - August 1, 2023 / 07:11 AM IST

Rain Alert Today : ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జాబితాలో ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఇక శుక్రవారం (ఆగస్టు 4న)  కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో మోస్తరు నుంచి  భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

Also read : Chandrayaan3-Moon Road : చంద్రుడి రూట్ లోకి చంద్రయాన్-3 ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ(Rain Alert Today )తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు గోదావరి వరద ప్రవాహం తగ్గుతోంది. భద్రాచలం దగ్గర నీటిమట్టం 46 అడుగులు ఉండగా.. 2వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ధవళేశ్వరం దగ్గర వరద ఇన్ & ఔట్ ఫ్లో 15.87లక్షల క్యూసెక్కులు ఉంది. 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.. పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణశాఖ అప్రమత్తం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా కదులుతోంది. అది ఏపీ వైపుగా వస్తున్నట్లు కనిపించినా.. ఆ తర్వాత మయన్మార్ వైపునకు మళ్లింది. ఇప్పుడు ఒడిశాకు దగ్గర్లో విస్తరిస్తోంది.. దీని ప్రభావం ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఉత్తర తెలంగాణపై కూడా ఉంటుంది. ఈ అల్పపీడనం తుఫాన్‌గా మారి.. కోల్‌కతా వైపు వెళ్లొచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

Also read : India vs Pakistan: ప్రపంచకప్‌లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌ కు కొత్త తేదీ ఫిక్స్.. కారణమిదే..!?