Sati Sametha Hanuman : హనుమంతుడు బ్రహ్మచారి అనేది కొందరి వాదన. కాదు అనేది మరికొందరి వాదన. చాలావరకు ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఆయన ఒక్కడి విగ్రహమే ఉంటుంది. సతీసమేత హనుమాన్ ఆలయాలు చాలా అరుదు. ఇలాంటి ఒక ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దాని విశేషాలను మనం ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :HCU History: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. ఎలా ఏర్పాటైందో తెలుసా ?
హనుమంతుడి మ్యారేజ్ గురించి..
సువర్ఛలా దేవి సూర్య పుత్రిక. హనుమంతుడు సూర్య భగవానుడి వద్ద విద్య నేర్చుకుంటూ నాలుగు వ్యాకరణాలను పూర్తి చేశాడట. ఐదో వ్యాకరణం అనేది కేవలం పెళ్లయిన వాళ్లకే బోధించాలనే నియమం ఉండేదట. అందువల్లే ఐదో వ్యాకరణాన్ని నేర్చుకునేందుకు హనుమంతుడు మ్యారేజ్ చేసుకున్నారట. స్వయంగా సూర్యభగవానుడే తన కూతురు సువర్ఛలను హనుమంతుడికి ఇచ్చి పెళ్లి చేశారట. పెళ్లయ్యాక హనుమంతుడు ఐదో వ్యాకరణం పూర్తి చేశాడట. తదుపరిగా సువర్ఛలా దేవి తపస్సుకు ఒకచోటుకు వెళ్లగా, హనుమంతుడు కూడా మరోచోటుకు తపస్సు కోసం వెళ్లాడట. నాటి నుంచి సువర్ఛలా సహిత హనుమంతుడు అనే పేరు వచ్చిందట. ప్రతి సంవత్సరం జ్యేష్ట మాసంలో హనుమంతుడి కల్యాణం జరుపుతుంటారు.
Also Read :Gold Vs Big Fall : రూ.56వేలకు బంగారం డౌన్.. ‘మార్నింగ్ స్టార్’ లెక్కలివీ
ఇల్లందు పట్టణంలో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో శ్రీ సువర్ఛల సహిత అభయాంజనేయ స్వామి ఆలయం(Sati Sametha Hanuman) ఉంది. దీన్ని 2006లో నిర్మించారు.ఈ గుడిలో ఆంజనేయ స్వామి తన సతీమణి సువర్ఛలతో కొలువుదీరారు. ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంటుంది. ఏటా హనుమాన్ జయంతి రోజున ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు జరిగితే.. ఈ ఆలయంలో మాత్రం ఆంజనేయ స్వామి కల్యాణం జరుగుతుంది. మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తుంటారు.