Site icon HashtagU Telugu

Leopard : హమ్మయ్య..’చిరుత’ చిక్కింది

Leopard Trapped In Shamshab

Leopard Trapped In Shamshab

గత ఐదు రోజులుగా అధికారులకు , శంషాబాద్ (Shamshabad) పరిసర ప్రాంత ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న చిరుత (Leopard )..ఎట్టకేలకు చిక్కింది. గత ఐదు రోజుల క్రితం ‘చిరుత’ ఆనవాళ్లను గుర్తించారు ప్రజలు. విమానాశ్రయంలోని ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్ సెక్షన్‌లోని కంచెపై నుంచి దూకేందుకు చిరుత ప్రయత్నించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు చిరుత ఆనవాళ్ల ఫై నిఘా పెట్టారు. ఆయా ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేయడమే కాకుండా చిరుత ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎవరూ చిరుత జాడ చెప్పలేదు. దీంతో చిరుత కోసం ఐదు బోన్లు, 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు అధికారులు. బోనుల్లో మేకలను ఉంచినప్పటికీ చిరుత మాత్రం చిక్కలేదు. పలుమార్లు బోను దగ్గరి వరకు వెచ్చిన చిరుత మళ్లీ వెనక్కి వెళ్లిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో కనిపించింది. దీంతో చిరుత బోనుల్లో చిక్కుందో లేదో అని అంత ఖంగారుపడుతూ వచ్చారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అది బోనులో చిక్కడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పులిని నెహ్రూ జూపార్క్‌కు తరలించనున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి అమ్రాబాద్‌ అడవుల్లో వదిలివేయనున్నామని అధికారులు తెలిపారు. ఇక చిరుత చిక్కడం తో ఆ పరిసర ప్రాంత ప్రజలతో పాటు అధికారులు సైతం ఊపిరి పీల్చుకున్నారు.

Read Also : Varalaxmi Sarathkumar’s Sabari: శబరి మూవీ రివ్యూ.. ఉత్కంరేపే ఎమోషనల్ డ్రామా!