Site icon HashtagU Telugu

Leopard: సంగారెడ్డిలో చిరుత సంచారం కలకలం

Leopard

Chirytha

సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం పారిశ్రామికవాడలో చిరుత (Leopard) సంచారం కలకలం రేపుతోంది. శనివారం తెల్లవారుజామున హెటిరో ఫ్యాక్టరీలోని హెచ్‌ బ్లాక్‌లోకి చిరుత (Leopard) దూరింది. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు చిరుత హెటిరో పరిశ్రమలోకి ప్రవేశించింది. హెటిరో ల్యాబ్‌లో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. హెటిరో పరిశ్రమలోని హెల్ బ్లాక్‌లో చిరుత దాక్కున్నట్టుగా తెలుస్తోంది.

దీంతో ఉద్యోగులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది హెటిరో పరిశ్రమకు చేరుకుని చిరుత కోసం గాలింపు చేపట్టారు. చిరుత సంచారంతో చుట్టు పక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిరుతను బంధించేందు జిల్లా అటవీ అధికారి శ్రీధర్‌ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతుంది. చిరుతను బంధించేందుకు బోన్ ఏర్పాటు చేశారు.

Also Read: Youtuber: యూట్యూబర్ పెళ్లి.. సబ్‌స్క్రైబర్స్ నుంచి రూ. 4 కోట్ల కట్నాలు..!