Mahesh Kumar Goud : లగచర్ల దాడి ఘటనపై టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. గురువారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దురుద్దేశ్యంతో వ్యవహరిస్తున్నాయని, ప్రభుత్వ పథకాలను తప్పుదోవ పట్టించడం మాత్రమే వీరి లక్ష్యమని పేర్కొన్నారు. మహేశ్ గౌడ్ మాట్లాడుతూ, హైడ్రా ప్రాజెక్ట్, మూసీ నది పునరుజ్జీవనం వంటి అంశాలపై ప్రభుత్వ చర్యలను తప్పు పట్టడం జరుగుతుందన్నారు. ఇప్పుడు లగచర్ల ఫార్మా విషయంలో కూడా అదే విధమైన అనేక శాసనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల దాడి వెనుక కుట్ర ఉందని, ఈ కుట్రకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాత్ర ఉందని మహేశ్ గౌడ్ ఆరోపించారు. ఈ ఘటనను అంత సులభంగా వదిలిపెట్టబోమని, నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
Winter: చలికాలంలో ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే జుట్టు ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం!
అంతేకాకుండా… కేటీఆర్ నుండి కాల్ వెళ్ళగానే పట్నం నరేందర్ రెడ్డి తన కార్యకర్తలతో దాడి చేయించారని ఆయన ఆరోపించారు. మొన్నటివరకు మూసీ, హైడ్రా విషయంలో అబద్ధాలు ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని.. కుట్రలో భాగంగానే కలెక్టర్ పై దాడి జరిగిందన్నారు మహేశ్ కుమార్ గౌడ్.
మరోవైపు, లగచర్ల దాడిలో కుట్రకోణం ఉన్నట్లు హైదరాబాద్ మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. ఆయన ప్రకారం, ఈ దాడి వ్యవహారం వెనుక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాత్ర ఉంది. ఆధారాలతో నిందితుడిగా ఆయనను చేర్చారు. ఇక, నరేందర్‌రెడ్డిని మరింత విచారించేందుకు పోలీసు కస్టడీలో తీసుకోవాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు. విచారణలో భాగంగా, దాడిలో పాల్గొన్న 42 మందిని గుర్తించామని, అందులో 19 మంది అసలు భూమి కలిగివుండడం లేదని వెల్లడించారు. ప్రాథమిక విచారణలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని వారు చెప్పారు.
Read Also : Destination Wedding: డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు ప్రసిద్ధి చెందిన భారతదేశంలోని ప్రదేశాలు