Site icon HashtagU Telugu

KTR : రాహుల్‌ గాంధీ, ఖర్గేకి కేటీఆర్‌ లేఖ

KTR's letter to Rahul Gandhi and Kharge

KTR's letter to Rahul Gandhi and Kharge

KTR : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. రాహుల్ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge)కి లేఖ(letter) రాసారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో చేసిన మోసంపైన కేటీఆర్‌ లేఖ రాశారు. రాష్ట్రంలో రుణమాఫీ అందని లక్షలాదిమంది రైతుల తరఫున ఈ లేఖ రాస్తున్నానని కేటీఆర్ తెలిపారు. సీఎం చెప్పిన అబద్ధాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను కేటీఆర్ ఈ లేఖలో పొందుపరుస్తునన్నట్లు వివరించారు. తెలంగాణలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకి రెండు రక్షల రుణమాఫీ హామీ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం అనేక షరతులు పెట్టి 40 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

40 వేల కోట్ల రూపాయల రుణమాఫీ అని చెప్పి కేవలం 17 వేల కోట్లకు పైగా రుణమాఫీతో రైతులను నట్టేట ముంచిందని మండిపడ్డారు. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని రైతులందరికీ రుణమాఫీ చేయాలని కేటీఆర్ తన లేఖలో డిమాండ్ చేశారు. లక్షల మంది రైతులు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపైన ఆందోళనలను చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి మాయ మాటలు చెప్పి తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే… వారి తరఫున కాంగ్రెస్ పార్టీ పైన పోరాడుతామని తెలియజేశారు.

కాగా, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లక్షరూపాయల రుణమాఫీ చేస్తేనే 17 వేల కోట్లు ఖర్చయింది. ఏకంగా 36 లక్షల మంది రైతులు రుణవిముక్తులై లబ్ది చేకూరింది. కాంగ్రెస్ చెబుతున్నట్టు రెండు లక్షల రుణమాఫీ పూర్తయితే.. లబ్దిదారుల సంఖ్యతోపాటు రుణమాఫీ మొత్తం పెరగాలి, దాదాపు రెట్టింపు కావాలి. కానీ కేవలం 17,900 కోట్లతో రెండు లక్షల రుణమాఫీని పూర్తిచేశామనడం ముఖ్యమంత్రి డొల్లవాదనకు నిదర్శనం. 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 22 లక్షల మందికి తూతూమంత్రంగా చేయడం.. కాంగ్రెస్ సర్కారు అసమర్థతకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది అన్నారు.

Read Also: Vinesh Phogat : సొంతూరిలో వినేశ్ ఫొగాట్‌ ఎమోషనల్.. గ్రామస్తులు ఏం ఇచ్చారో తెలుసా?