Congress MP: కాంగ్రెస్ ఎంపీ (Congress MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి.. కేటీఆర్‌పై (KTR) మరోసారి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ చేసిన ఘనకార్యాలకు గాను త్వరలోనే ఈడీ, ఏసీబీ, కోర్టులు తగిన గుర్తింపునిస్తాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ గురించి కేటీఆర్ చెబుతుంటే నవ్వాలో.. ఎడ్వాలో కూడా అర్థం కాట్లేదని చురకలు అంటించారు. ఎంపీ చామల తన ఎక్స్ ఖాతా వేదికగా కేటీఆర్ మాట్లాడిన వీడియోని పోస్ట్ చేసి విమర్శలు చేశారు.
ఎంపీ తన ఎక్స్ ఖాతాలో.. తెలంగాణ గురించి తెలంగాణకు మీరు చేసిన దాని గురించి నువ్వు చెబుతుంటే నవ్వాలో ఎడవాలో తెలియడం లేదు. తెలంగాణా కు మీరు ఏం చేశారు? 1600 వందలకు పైగా బిడ్డల ప్రాణాలు పణంగా పెట్టి ఎందరో ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో మీరు మీ కుటుంబం చేసిన త్యాగం ఏంటీ డ్రామారావు అని ప్రశ్నించారు. కుటుంబం మొత్తం పదవులు అనుభవించారు తప్ప.. తెలంగాణ వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి దళిత సమాజాన్ని మోసం చేశారని దుయ్యబట్టారు.
Also Read: Asteroid Earth Collision: భూమికి తృటిలో తప్పిన ప్రమాదం!
తెలంగాణ గురించి తెలంగాణకు మీరు చేసిన దాని గురించి నువ్వు చెబుతుంటే నవ్వాలో ఎడవాలో తెలియడం లేదు…
తెలంగాణా కు మీరు చేసినది ఎం ఉంది
1600 వందలకు పైగా బిడ్డల ప్రాణాలు పణంగా పెట్టి ఎందరో ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ లో మీరు మీ కుటుంబం చేసిన త్యాగం ఎంటి @KTRBRS డ్రామారావు… pic.twitter.com/ueam5ldsuZ— Kiran Kumar Chamala (@kiran_chamala) January 9, 2025
నమ్మి అధికారం అప్పజెప్పితే వ్యవస్థలను భ్రష్టు పుట్టించి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కుటుంబం మొత్తం. రూ. 7 లక్షల కోట్లు అప్పు చేసి మీరు వేల కోట్లు కమీషన్లు, భూముల పేరుమీద వెనకేసుకోని తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశారు. 7 లక్షల కోట్లు అప్పు అంటే ఈ రోజు తెలంగాణలో అందరికి ఫ్రీ వైద్యం అందుతుండాలే అని ఎంపీ విమర్శించారు. 7 లక్షల కోట్లు అప్పు అంటే ఈ రోజు తెలంగాణలో అందరికి KG టూ PG ఫ్రీ ఎడ్యుకేషన్ అందుతుండాలే. 7 లక్షల కోట్లు అప్పు అంటే హాస్టలలో పిల్లలకు నాణ్యమైన భోజనం అందుతుండాలే. 7 లక్షల కోట్లు అప్పు అంటే రైతులకు ప్రతి సంవత్సరం రుణమాఫీ చేయొచ్చు.. ఇంకా ఎన్నో చేయొచ్చు అని మండిపడ్డారు. ఇవేం చేయకుండా రూ. 7 లక్షల కోట్లు అప్పు చేశారంటే అక్రమ కాంట్రాక్టుల ద్వారా అందినకాడికి దోచుకోని తెలంగాణ సంపదను హవాలా ద్వారా దేశం దాటించినట్లే కదా అని ప్రశ్నించారు.
నువ్వేదో ఘనకార్యం చేసినట్లు మళ్లీ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తా అంటున్నావ్? అధికారం వచ్చాక పార్టీ పేరులోని తెలంగాణను పీకేశారు. చాలు నువ్వు, నీ అయ్య.. నీ కుటుంబం చేసిన ఘనకార్యాలు. మీరు చేసిన వాటికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. రేపోమాపో ఈడీ, ఏసీబీ, కోర్టులు కుడా మీ ఘనకార్యాలకు తగిన గుర్తింపునిస్తారని పేర్కొన్నారు.