Site icon HashtagU Telugu

Minister KTR: మహిళ రిజర్వేషన్ లో నా సీటు పోయినా పర్లేదు: కేటీఆర్

Minister KTR

Minister KTR

Minister KTR: పార్లమెంట్ సాక్షిగా మహిళ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర పడింది. లోకసభ, అసెంబీ స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న వాదనకు తెరపడింది. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ లో మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. బీజేపీ ప్రవేశపెట్టిన ఈ బిల్లును ప్రతి ఒక్కరు సమర్థిస్తున్నారు. ప్రజాజీవితంలోకి మహిళలు వచ్చేందుకు ఈ బిల్లు ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షాలు సైతం బిల్లును ఆహ్యానించాయి. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ మహిళ రిజర్వేషన్ బిల్లుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మాదాపూర్ లో ఇంటర్నేషనల్ టెక్‌పార్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును సంపూర్ణంగా స్వాగతిస్తున్నానని చెప్పారు కేటీఆర్. రాజకీయాల్లోకి మహిళా నేతలు రావాలని ఆకాంక్షించారు. రిజర్వేషన్‌లో భాగంగా నా సీటు పోవాల్సి వస్తే సంపూర్ణంగా స్వీకరిస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు లో ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్టు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కేటీఆర్ స్టేట్మెంట్ తో బీఆర్ ఎస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కేటీఆర్ అవసరమైతే తన సీటుని కూడా త్యాగం చేస్తాననడం ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటుంది.

Also Read: Jagan Govt Good News : ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ వరాల జల్లు..