Site icon HashtagU Telugu

CM Revanth Reddy : ప్ర‌జ‌లంద‌ర్నీ కూడ‌గ‌ట్టి కాంగ్రెస్ పార్టీని రాజ‌కీయంగానే బొంద పెడుతాం – కేటీఆర్

Ktr

Ktr

కాంగ్రెస్ (Congress) ప్రకటించిన హామీలన్నీ అమలు చేయకపోతే.. వెంటాడుతాం.. వేటాడుతాం.. ప్ర‌జ‌లంద‌ర్నీ కూడ‌గ‌ట్టి కాంగ్రెస్ పార్టీనిరాజ‌కీయంగానే బొంద పెడుతాం అని హెచ్చరించారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR). లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడం తో కేటీఆర్ వరుస సమావేశాలతో బిజీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడడం తో లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను గెలిపించి ప్రజల్లో నమ్మకం పెంచేలా చేయాలనీ చూస్తున్నారు. ఈ క్రమంలో గత కొద్దీ రోజులుగా పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ బిఆర్ఎస్ నేతలతో సమావేశం అవుతూ వస్తున్నారు.

ఇక ఈరోజు మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మేడిప‌ల్లిలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ మీటింగ్‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో క‌రెంట్, తాగు, సాగు నీటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకున్నాం. సంక్షేమ ప‌థ‌కాలు ద్వారా ప్ర‌తి కుటుంబానికి మేలు చేశాం. కానీ ప్రజలు కాంగ్రెస్ 420 హామీలు నమ్మి మోసపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డానికి అర‌చేతిలో వైకుఠం చూపెట్టి 420 హామీలు ఇచ్చి గ‌ద్దెనెక్కారు రేవంత్ రెడ్డి. సీఎం కాగానే 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీపై సంత‌కం పెడుతాన‌ని , సంవ‌త్స‌రంలో 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తాన‌ని ఇలా అన్ని చెప్పి ప్రజలను మోసం చేసారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే నా ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే కుట్ర జ‌రుగుతుంద‌ని రేవంత్ రెడ్డి పదే పదే అంటున్నాడని… నీ ప‌క్క‌కే న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం మాన‌వ‌బాంబులు ఉన్నాయి. వాళ్లే నిన్ను ఇబ్బంది పెడుతారు. నీ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే ఖ‌ర్మ మాకు అవ‌స‌రం లేదు. కాంగ్రెస్ నేతలే నీ ప్రభుత్వాన్ని పడగొడతారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. నీ ప్ర‌భుత్వం ఐదేండ్లు ఉండాల‌ని కోరుకుంటున్నాం. 420 హామీలు అమ‌లు చేయాల‌ని కోరుతున్నాం. చేయ‌క‌పోతే మాత్రం వెంటాడుతాం.. వేటాడుతాం.. ప్ర‌జ‌లంద‌ర్నీ కూడ‌గ‌ట్టి కాంగ్రెస్ పార్టీనే రాజ‌కీయంగానే బొంద పెడుతాం అని హెచ్చరించారు. ఇక ఫోన్ల ట్యాపింగ్స్ మీద పెట్టిన శ్ర‌ద్ద వాట‌ర్ ట్యాపింగ్స్ మీద పెట్టు. వాట‌ర్ ట్యాంక‌ర్లు తిరుగుతున్నాయి ఊర్ల‌లో. కేసీఆర్ ఇంటంటికి నీళ్లు ఇచ్చిండు.. ఆ మాదిరిగా నువ్వు కూడా తాగునీళ్లు ఇవ్వు అని కేటీఆర్ సూచించారు.

Read Also : Parigi MLA Ram Mohan Reddy : హరీష్ రావు నీ తాటతీస్తా జాగ్రత్త.. ఆ ఎమ్మెల్యే వార్నింగ్