Site icon HashtagU Telugu

Lok Poll : ఓటర్లరా..ఈ వస్తువులు స్టాక్ పెట్టుకోండి అంటూ కేటీఆర్ సలహా

KTR Fire On Congress

For the Congress party, politics is more important than the benefit of the farmers: KTR

తెలంగాణ (Telangana) లో మరో రెండు రోజుల్లో లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారానికి తెరపడబోతుంది. దీంతో ఉన్న ఈ రెండు రోజుల్లో ఓటర్లను మరింత తమవైపు తిప్పుకోవాలని అన్ని పార్టీలు చూస్తున్నాయి. అలాగే ఈ కొద్దీ సమయంలోనే పార్టీల అధినేతలు తమ అభ్యర్థుల కోసం విపరీతంగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. కేవలం సభలు , సమావేశాల ద్వారానే కాదు సోషల్ మీడియా వేదికగా కూడా ప్రచారం , ఒకరిపై ఒకరు విమర్శలు , ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ తరుణంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఫై తనదైన స్టయిల్ లో సెటైర్లు వేశారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రస్తుత కాలంలో కొన్ని వస్తువులను స్టాక్ పెట్టుకోవాలని ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు. తెలంగాణలో ఎన్నికలు ముగిస్తే వాటి అవసరం తప్పనిసరిగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ల లాగా, తాను ఆరు వస్తువులు చెబుతున్నానని తెలిపారు.

1. ఇన్వర్టర్
2. చార్జింగ్ బల్బులు
3. టార్చ్ లైట్లు
4. కొవ్వొత్తులు
5. జనరేటర్లు
6. పవర్ బ్యాంకులు అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఆరు గ్యారెంటీగా స్టాక్ పెట్టుకోవాలని ఆయన సూచించారు. వీటినే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు గా హామీ ఇచ్చిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారుతుంది. వాస్తవానికి నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చాల చోట్ల కరెంట్ కటింగ్ అనేది జరుగుతుంది. కాంగ్రెస్ నేతలు కరెంట్ కటింగ్ అనేది జరగడం లేదని అంటున్నప్పటికీ..నిజానికి కరెంట్ అయితే పోతుంది. మరి ఇది కావాలని కట్ చేస్తున్నారా..? లేక ఏదైనా సమస్య వల్ల పోతుందా అనేది తెలియనప్పటికీ కరెంట్ కటింగ్ మాత్రం ఉంది. అందుకే కాబోలు కేటీఆర్ ఆలా ట్వీట్ చేసి ఉండొచ్చని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read Also : TS : ఇందిరమ్మ ఇళ్ల..కొత్త రేషన్‌ కార్టులపై ఉత్తమ్‌ కుమార్‌ కీలక ప్రకటన