Site icon HashtagU Telugu

KTR Delhi Tour: కవిత కోసం రేపు ఢిల్లీకి కేటీఆర్…

KTR Delhi Tour

KTR Delhi Tour

KTR Delhi Tour: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉన్నారు. కాగా కవితను తాజాగా ఈడీ కస్టడీ నుంచి సీబీఐ కూడా తమ కస్టడీకి తీసుకుంది. లిక్కర్ కేసులో ఆమె పేరు ప్రధానంగా వినిపిస్తుండటంతో కవిత నుంచి పలు విషయాలను రాబట్టేందుకు ఈడీ , సీబీఐ మరికొన్ని రోజులు ఆమెను తమ కష్టడీలోనే ఉంచనున్నారు. ఇదిలా ఉండగా సీబీఐ కస్టడీలో ఉన్న తన సోదరి కవితను కలిసేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఆదివారం ఢిల్లీకి వెళ్తున్నారు.

కస్టడీ సమయంలో కుటుంబ సభ్యులను రోజూ ఒక గంట పాటు సందర్శించేందుకు అనుమతిస్తారు. కవిత ప్రస్తుతం సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణను ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 6.00 నుంచి 7.00 గంటల మధ్య కవిత లాయర్‌ని, కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఉంది. రేపు సాయంత్రం ఈ సమయంలో కవితతో కేటీఆర్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది . ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి విధిస్తూ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15 వరకు ఆమె సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు.ఏప్రిల్ 15న ఉదయం 10 గంటలకు మరోసారి కోర్టుకు హాజరు కావాలని ఢిల్లీ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

We’re now on WhatsAppClick to Join

కవితపై సీబీఐ విచారణ నిన్న మొదలైంది. ఈరోజు కూడా కవిత సీబీఐ విచారణను ఎదుర్కోనున్నారు. కవిత ప్రస్తుతం ఢిల్లీలోని లోధి రోడ్డులోని జవహర్ లాల్ నెహ్రూ మార్గ్‌లోని సీబీఐ సెంట్రల్ ఆఫీస్‌లో ఉన్నారు, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మద్యం పాలసీ అక్రమాల్లో కవిత కీలక సూత్రధారిగా సీబీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే.మద్యం పాలసీ రూపకల్పన, ఆమ్‌ ఆద్మీ పార్టీకి 100 కోట్ల విరాళాలు, సౌత్‌ గ్రూప్‌ నుంచి డబ్బులు సమకూర్చడం, నిందితులు, అప్రూవర్‌లుగా మారిన వాట్సాప్‌ చాటింగ్‌లు, వాంగ్మూలాలపై కవితను సీబీఐ ప్రశ్నిస్తోంది . సీసీటీవీ పర్యవేక్షణలో సీబీఐ విచారణ కొనసాగుతోందని లేఖలో పేర్కొన్నారు . సీబీఐ కస్టడీలో ఉన్న కవితకు ప్రతి 48 గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

Also Read: Gopichand: ఓటీటీలోకి వచ్చేస్తున్న గోపిచంద్ యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా, ఎప్పుడంటే

Exit mobile version