Site icon HashtagU Telugu

KTR : రాహుల్‌గాంధీ కంటే ముందే కులగణన చేయాలని చెప్పింది బీఆర్‌ఎస్సే

Ktr Assembly

Ktr Assembly

KTR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో బీఆర్‌ఎస్ తరపున కేటీఆర్ పాల్గొన్నారు. ఈ బిల్లును స్వాగతిస్తున్నామని ప్రకటించిన ఆయన, బీసీ సబ్‌ప్లాన్ కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కేవలం ఇప్పుడే కాకుండా, గతంలో కూడా బీసీల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ గట్టిగా పోరాడిందని కేటీఆర్ గుర్తుచేశారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. కేంద్రంలో ప్రత్యేకంగా ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లారని కేటీఆర్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌ పదవులను బీసీలకు కల్పించామని అన్నారు. అలాగే, రాహుల్ గాంధీ కులగణన గురించి మాట్లాడటానికి ముందే, బీఆర్‌ఎస్ పార్టీ కులగణన చేయాలని డిమాండ్ చేసిందని కేటీఆర్ స్పష్టం చేశారు.

TG Assembly Session : గంగుల కమలాకర్ VS పొన్నం ప్రభాకర్

రిజర్వేషన్లపై సీలింగ్‌ను సుప్రీంకోర్టులోని ధర్మాసనం విధించిందని, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు తాము ఢిల్లీ ధర్నాకు రాలేదని విమర్శించడాన్ని కేటీఆర్ ఖండించారు. ధర్నాకు రాహుల్ గాంధీ, ఖర్గే ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని ముఖ్యమంత్రిని కోరారు. దీనికి బీఆర్‌ఎస్ పార్టీ కూడా పూర్తి మద్దతు ఇస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.

CM Revanth Reddy : ఆరునూరైనా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం