BRS Office : ఢిల్లీలో హిమాన్ష్ హైలెట్‌! కేసీఆర్ కు ఇద్ద‌రు సీఎంల జ‌ల‌క్‌!

ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాల‌యం(BRS Office) ప్రారంభించిన రోజే కేసీఆర్ కు షాక్ త‌గిలింది. ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థిత్వాన్ని ఆశిస్తోన్న ఆ ఇద్ద‌రూ ముందున్నారు.

  • Written By:
  • Updated On - December 14, 2022 / 05:56 PM IST

ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాల‌యం(BRS Office) ప్రారంభించిన రోజే కేసీఆర్ కు రాజ‌కీయ షాక్ త‌గిలింది. పార్టీ ఆఫీస్ ప్రారంభోత్స‌వానికి మ‌మ‌త‌, నితీష్ ఇద్ద‌రూ హాజరు కాలేదు. కాంగ్రెస్, బీజేయేత‌ర పార్టీ సీఎంలుగా ఉన్న వాళ్లిద్ద‌ర్నీ కేసీఆర్ ఆహ్వానించారు. ప్ర‌ధాన మంత్రి(Prime Minister) అభ్య‌ర్థిత్వాన్ని ఆశిస్తోన్న వాళ్ల జాబితాలో ఆ ఇద్ద‌రూ ముందున్నారు. ఇప్పుడు ప్ర‌ధాన మంత్రి(Prime Minister) ప‌ద‌వి కోసం పార్టీ ఆఫీస్ ను(Office) ఢిల్లీలో కేసీఆర్ పెట్టారు. కేవ‌లం యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్‌, క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార స్వామి మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. మిగిలిన రాష్ట్రాల నుంచి ఎవ‌రూ పెద్ద‌గా హాజ‌రు కాలేదు. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కూడా ఇటీవ‌ల కేసీఆర్ కు దూరంగా ఉంటున్నారు. ఆయ‌న కూడా ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్స‌వానికి హాజ‌రు కాలేదు.

బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్స‌వానికి తెలంగాణ నుంచి టీఆర్ఎస్ క్యాడ‌ర్ మిన‌హా పెద్ద‌గా ఎవ‌రూ వెళ్ల‌లేదు. ఏపీ నుంచి కూడా ఎవ‌రూ హాజ‌రు కాలేదు. వైసీపీ చీఫ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఆహ్వానం అందిందా? లేదా? అనేది కూడా ధ్రువీక‌ర‌ణ కాలేదు. జాతీయ రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన కేసీఆర్ (KCR)ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో భేటీ కాలేదు. ఇత‌ర రాష్ట్రాలకు సంబంధించిన ప్ర‌ధాన పార్టీల చీఫ్ ల‌ను మాత్రం కలుసుకున్నారు. తెలంగాణ సీఎం హోదాలో ప‌లు రాష్ట్రాల‌కు కేసీఆర్ (KCR)వెళ్లారు. ఫెడ‌ర‌ల్ స్పూర్తిని ర‌గిలించే ప్ర‌య‌త్నం చేశారు. విచిత్రంగా ప‌క్క‌నే ఉన్న ఏపీకి మాత్రం ఆయ‌న వెళ్ల‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మే.

ఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీస్ లో 

గ‌త రెండు రోజులుగా ఢిల్లీ బీఆర్ఎస్ (BRS Office)ఆఫీస్ లో రాజ‌శ్యామ‌ల యాగం, చండీ యాగం చేయించారు కేసీఆర్. సాధారణంగా ఇలాంటి కార్యక్ర‌మాల‌కు కుటుంబం స‌మేతంగా కేసీఆర్ హాజ‌రు అవుతారు. గ‌తంలోనూ ఫామ్ హౌస్ కేంద్రంగా చేసిన యాగాలు, పూజ‌ల‌కు కుటుంబ స‌భ్యులు అంద‌రూ పాల్గొన్నారు. ఈసారి ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కార్య‌క్ర‌మాల‌కు మంత్రి కేటీఆర్ కుటుంబం దూరంగా ఉంది. కానీ, కేటీఆర్ కుమారుడు హిమాన్షు(Himansh) బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్స‌వంలో హైలెట్ గా నిలిచారు. గ‌తంలోనూ సీఎం కుర్చీలో హిమాన్షు(Himansh) కూర్చొని ముచ్చ‌ట తీర్చుకున్నాడు. భ‌ద్రాద్రిరాములోరి క‌ల్యాణానికి ప‌ట్టు వ‌స్త్రాలు ముత్యాల‌ను తీసుకెళ్లాడు. సీఎం హోదాలో చేయాల్సిన ప‌నుల‌ను హిమాన్షు(Himansh) చేయ‌డం ద్వారా అప్ప‌ట్లో వార్తల్లోకి ఎక్కారు. ఇప్పుడు మ‌ళ్లీ ఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్స‌వంలో క‌నిపించ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది.

కేసీఆర్ మ‌న‌వ‌డు హిమాన్ష్

ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్స‌వ రోజున కాంగ్రెస్ పార్టీ ముట్ట‌డించింది. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త సునీల్ క‌నుగోలు ఆఫీస్ మీద తెలంగాణ పోలీసులు దాడి చేశారు. కంప్యూట‌ర్ల‌ను, డేటాను సీజ్ చేశారు. క‌ర్ణాట‌క‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించిన స‌ర్వేల రిపోర్టులు, ఓట‌ర్ల‌కు సంబంధించిన సమాచారం వాటిల్లో నిక్షిప్త‌మైంద‌ని కాంగ్రెస్ చెబుతోంది. ఉద్దేశ పూర్వ‌కంగా కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయ‌డానికి వార్ రూమ్ మీద పోలీసులు దాడిచేశార‌ని నిర‌సిస్తూ తెలంగాణ వ్యాప్తంగా క్యాడ‌ర్ పోరాటానికి దిగింది. ఆ క్ర‌మంలో ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీస్ ను ముట్ట‌డించడానికి కాంగ్రెస్ క్యాడ‌ర్ ప్ర‌య‌త్నం చేసింది. మొత్తం మీద కేసీఆర్(KCR) ఆహ్వానించిన ఇద్ద‌రు సీఎంలు పార్టీ ఆఫీస్ ఓపెనింగ్‌కు రాక‌పోగా, కుటుంబ స‌భ్యులు అంద‌రూ హాజ‌రు కాలేదు. కేసీఆర్ మ‌న‌వ‌డు హిమాన్ష్ (Himansh)హైలెట్ గా నిల‌వ‌డం హాట్ టాపిక్ గా మారింది.

BRS in Amaravati : అమరావతిలో కేసీఆర్ భారీ బహిరంగసభ..!