Formula E Race: ఫార్ములా ఇ రేసు రద్దు చేయడంపై కేటీఆర్ ఫైర్

గత ప్రభుత్వంలో హైదరాబాద్ (Hyderabad) లో ఫార్ములా ఇ రేసు ప్రారంభమైంది. కేటీఆర్(KTR) స్వయంగా ఈ రేసును ప్రారంభించారు. కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఇ రేసును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Formula E Race: హైదరాబాదులో ఫార్ములా ఈ రేస్ రద్దు అయింది. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం వల్లే రద్దు చేసుకుంటున్నామని ప్రకటించారు. ఫిబ్రవరి 10న ఈ ప్రిక్స్ ఈవెంట్ హైదరాబాద్ లోని హుస్సేన్‌సాగర్ సమీపంలో జరగాల్సి ఉంది. కాగా హైదరాబాద్‌కు బదులు మెక్సికో సిటీలో ఈ రేస్ నిర్వహించనున్నారు

గత ప్రభుత్వంలో హైదరాబాద్ (Hyderabad) లో ఫార్ములా ఇ రేసు ప్రారంభమైంది. కేటీఆర్(KTR) స్వయంగా ఈ రేసును ప్రారంభించారు. కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఇ రేసుపై ఆసక్తి చూపించడం లేదు. . దీంతో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. నగరంలో ఫిబ్రవరి 9న జరగనున్న ఫార్ములా ఇ రేసును నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం రాజకీయ పరమైన చర్యగా పేర్కొన్నారు.హైదరాబాద్ ఇ-ప్రిక్స్ వంటి ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా మన నగరం మరియు దేశానికి బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతాయని కెటిఆర్ అన్నారు, కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం మొదటిసారిగా ఫార్ములా ఇ-ప్రిక్స్ తీసుకురావడానికి చాలా కృషి చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు.

స్టార్టప్‌లను ఆకర్షించడానికి మరియు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఫార్ములా-ఇ రేస్‌ ఒక రకంగా ఉపయోగపడినట్టు కేటీఆర్ చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా (FMSCI) అధ్యక్షుడు అక్బర్ ఇబ్రహీం, అతని బృందం ఫార్ములా ఇ ని హైదరాబాద్‌కు తీసుకురావడంలో అద్భుతమైన సహకారం అందించారు. అయితే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై వారు నిరాశను వ్యక్తం చేసినట్టు కేటీఆర్ అన్నారు.

ఫార్ములా ఇ అధికారులు ఈ నెల ప్రారంభంలో కొత్త ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రారంభంలో ఫార్ములా E తెలంగాణ ప్రభుత్వం మరియు గ్రీన్కో మధ్య నాలుగు సంవత్సరాల ఒప్పందం కుదిరింది. కాగా ఇప్పుడు దాన్ని రద్దు చేసింది. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఫిబ్రవరి 10న ఈ ప్రిక్స్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగాల్సి ఉంది. హైదరాబాద్‌కు బదులు మెక్సికో సిటీలో ఈ రేస్ నిర్వహించనున్నారు

Also Read: MP Balasouri : టీడీపీ లోకి వైసీపీ ఎంపీ బాలశౌరి..?