KTR: తెలంగాణలో అధికార మార్పిడి తర్వాత రాజకీయ పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. పరిగిలో జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం,
CM రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ప్రభుత్వాన్ని పొగడటంలో అతిగా వ్యవహరిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు భవిష్యత్తులో తమ ప్రభుత్వం వచ్చాక లెక్కలు సెటిల్ చేస్తామని హెచ్చరించడం సంచలనం సృష్టించింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు, రాజకీయ డ్రామాలు
ఎమ్మెల్యేల గందరగోళం
కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై కేటీఆర్ స్పందించారు. “కాలే యాదయ్య ఏ పార్టీలో ఉన్నారో పక్కనే ఉన్న స్పీకర్‌కు తెలియడం లేదు” అని వ్యంగ్యంగా అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో మాత్రం బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి రాజకీయ డ్రామాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ విచిత్రమైన వ్యక్తిగా అభివర్ణించారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ పేరు ఎత్తనిది నిద్ర పట్టదని, రాత్రి కలల్లో కూడా కేసీఆర్ పేరు తలుచుకుంటారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిది రాహుల్ గాంధీతో దోస్తీ డ్రామా అని, మోడీతో కుస్తీ డ్రామా అని, చంద్రబాబు జలదోపిడీపై ఫైటింగ్ విషయంలో పెద్ద డ్రామా అని విమర్శించారు. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డిపై ఓడిపోయిన వ్యక్తిని వేదికపై కూర్చోబెట్టి అవమానించారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి జడ్పీటీసీ కాకముందే సబితా ఇంద్రారెడ్డి మంత్రి అయ్యారని గుర్తు చేశారు.
Also Read: Green Energy Corridor: గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు అనుమతివ్వండి.. కేంద్ర మంత్రిని కోరిన డిప్యూటీ సీఎం!
ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఆగ్రహం
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అతిగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అధికారులు అనడంపై ఆయన మండిపడ్డారు. “మళ్లీ వచ్చేది మేమే. మీ లెక్కలన్నీ సెటిల్ చేస్తాం. ఎవరెవరు ఎగిరిపడ్డారో వారి సంగతి చూస్తాం” అని తీవ్రంగా హెచ్చరించారు.
బీఆర్ఎస్‌కు మద్దతు కోరిన కేటీఆర్
పరిగి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఏడు జడ్పీటీసీలు, ఏడు ఎంపీపీలు బీఆర్ఎస్‌ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. అప్పుడు అధికారులు తమ చుట్టూ తిరుగుతారని ఆయన భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో పడిపోయిన రియల్ ఎస్టేట్
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారిశ్రామిక, ఆర్థిక రంగాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి అత్తా-కోడళ్ళ మధ్య పంచాయతీ పెట్టారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పని తాను చేసుకుంటున్నారని, ప్రస్తుతం ఆరోగ్యం డీలా పడటంతో దాన్ని సెట్ చేసుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు.