Site icon HashtagU Telugu

BRS : ఇప్పటికిప్పుడు ఎన్నికలువస్తే బిఆర్ఎస్ 100 సీట్లతో విజయం సాధిస్తుంది – కేటీఆర్

Ktr Kmm

Ktr Kmm

తెలంగాణ అభివృద్ధిలో బీఆర్‌ఎస్‌ (BRS) పాలనే కీలకమని, కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని తీవ్రంగా విమర్శించారు. రైతులకు, యువతకు, వృద్ధులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని తెలిపారు. గ్యారంటీలు పేరిట ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ కాటుకు ఓటేసిన ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు.

Felix Baumgartner : సూపర్‌సోనిక్ స్కైడైవర్ ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ మరణం

స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Elections) బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత ఎక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో స్థానిక నేతలు ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్‌ మోసాలను వివరించాలని సూచించారు. రేవంత్ రెడ్డికి రాజకీయ పాఠం చెప్పే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇంకా ఇప్పటికిప్పుడే ఎన్నికలు వస్తే బీఆర్‌ఎస్‌ 100 సీట్లు గెలిచి తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన అంబేద్కర్ ఊహించిన దానికి విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.

ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ధి కనిపించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల పనితీరుపై ఎద్దేవా చేస్తూ, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయశాఖ మంత్రిగా ఎరువుల కొరతను కూడా ఎదుర్కొనలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు పాల్గొనగా, అనంతరం కేటీఆర్ ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ కుటుంబాన్ని పరామర్శించి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

KTR – Lokesh : లోకేష్ ను కలిస్తే తప్పేంటి – రేవంత్ కు కేటీఆర్ సూటి ప్రశ్న