KTR : ఈసారి కేంద్రంలో ఇండియా కూటమికి కానీ, ఎన్డీయే కూటమికి గానీ ఆధిక్యం రాదని.. ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమే ఢిల్లీలో అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్(KTR) జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లకు తమ పార్టీ ముచ్చెమటలు పట్టించిందని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచారని కేటీఆర్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సరళిపై మంగళవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు.
We’re now on WhatsApp. Click to Join
తెలంగాణలోని దాదాపు ఆరేడు సీట్లలో డమ్మీ కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టి బీజేపీ నేతలకు రేవంత్ రెడ్డి సహకరించారని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డే ఎక్కువగా కష్టపడ్డారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీలో కుస్తీలు, గల్లీలో దోస్తీలాగా పనిచేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు అత్యధిక సంఖ్యలో సీట్లు వస్తాయన్నారు. బీజేపీపై ప్రజా వ్యతిరేకత ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందన్న కేటీఆర్.. పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెరిగినందుకు మోడీపై జనం తీవ్ర కోపంతో ఉన్నారని చెప్పారు.
Also Read : Jaggareddy Vs Laxman : లక్ష్మణ్ పొలిటికల్ చిప్ ఖరాబైంది.. రిపేర్ చేయించుకో : జగ్గారెడ్డి
ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా నిధులు వేయనందుకు కాంగ్రెస్‌పై రైతులు ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందనే అభిప్రాయాలు రైతులు వచ్చారని ఆయన పేర్కొన్నారు. నెలకు రూ.2500 ఆర్థిక సాయం ఇస్తామని కాంగ్రెస్ మాట తప్పిందని తెలంగాణలోని మహిళలు అందరికీ అర్థమైందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈసారి సగం లోక్‌సభ సీట్లను బీసీ కులాలకు కేటాయించిందని కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తల కష్టం వృథాగా పోదని. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు మంచి ఫలితం ఉంటుందని తెలిపారు.