Site icon HashtagU Telugu

KTR : రాజగోపాల్‌రెడ్డి డబ్బు మదాన్ని అణచివేస్తాం : కేటీఆర్

Ktr

Ktr

KTR : డబ్బు, మద్యం, వంద కోట్లతో మునుగోడులో మళ్లీ గెలవాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చూస్తున్నారని.. కచ్చితంగా ఈసారి ఆయనను ఓడించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. గత ఏడాది జరిగిన మునుగోడు బైపోల్‌లో పాల్వాయి స్రవంతి లేకపోతే.. కాంగ్రెస్ పార్టీకి  ఆ ఓట్లు కూడా పడేవి కావన్నారు. మునుగోడులో తమతో కలిసి వచ్చే అందరికీ స్థానిక సంస్థల్లో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. మునుగోడు కాంగ్రెస్ కీలక నేత పాల్వాయి స్రవంతి ఆదివారం (నవంబరు 12) బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేటీఆర్ కండువా కప్పి స్రవంతిని పార్టీలోకి ఆహ్వానించారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘ధనం ఉందని, జనాన్ని కొంటానని రాజగోపాల్ రెడ్డి చూస్తున్నాడు. రాజగోపాల్ రెడ్డి డబ్బు మదాన్ని ఈ ఎన్నికల్లో అణచివేయాలి. గువ్వల బాలరాజుపై నిన్న దాడి చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచిది కాదు. ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము లేక భౌతిక దాడులు చేస్తున్నారు. నేను ఆసుపత్రికి వెళ్తున్నా ఆయన్ని పరామర్శిస్తా’’ అని కేటీఆర్ వెల్లడించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఏ కారణం చేత రాజగోపాల్ రెడ్డి పార్టీలు మారాడు అనేది అర్థం కాలేదు. అసలు ఆ ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో తెలియదు. మళ్ళీ ఎందుకో కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి చేరాడు. మాకు పాల్వాయి కుటుంబంతో అనుబంధం ఉంది. తెలంగాణ బాగుండాలని కోరుకున్న వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్‌లోనే కొనసాగిన గోవర్దన్ రెడ్డి కూతురికి కూడా టికెట్ ఇవ్వకపోవడం దారుణం’’ అని(KTR) చెప్పారు.

Also Read: Tunnel Collapses: దీపావళి రోజున ఘోర ప్రమాదం.. ఉత్తరాఖండ్‌లో కూలిపోయిన సొరంగం, 35 మంది కూలీల కోసం సహాయక చర్యలు..!

Exit mobile version