Site icon HashtagU Telugu

KTR : హస్తినకు ప్రదక్షిణలు తప్ప..రాష్ట్రానికి రూపాయి లాభం లేదు – సీఎం పై కేటిఆర్ సెటైర్లు

Ktr Cmnt

Ktr Cmnt

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పై మరోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు మాజీ మంత్రి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ (KTR). సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి సీఎం రేవంత్.. 25 సార్లు హస్తిన పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసాడు..కానీ పైసా పనిలేదు.. రాష్ట్రానికి రూపాయి లాభం లేదంటూ కేటిఆర్ పేర్కొంటూ ట్వీట్ చేసారు.

‘‘పైసా పనిలేదు – రాష్ట్రానికి రూపాయి లాభం లేదు
10 నెలలు – 25 సార్లు – 50రోజులు
పోను 25 సార్లు, రాను 25 సార్లు, నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివి. తట్టా మట్టి తీసింది లేదు కొత్తగా చేసింది అసలే లేదు
అయినను పోయి రావాలె హస్తినకు

అన్నదాతల అరిగోసలు
గాల్లో దీపాల్లా గురుకులాలు
కుంటుపడ్డ వైద్యం
గాడి తప్పిన విద్యా వ్యవస్థ
అయినను పోయి రావాలె హస్తినకు

మూసి పేరుతో – హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొట్టి – 420 హామీలను మడతపెట్టి మూలకు వేసి
అయినను పోయి రావాలె హస్తినకు
పండగలు పండగళ్ళా లేవు ఆడబిడ్డల చీరలు అందనేలేవు అవ్వాతాతలు అనుకున్న పింఛను లేదు తులం బంగారం జాడనే లేదు స్కూటీలు లేవు, కుట్టు మిషిన్లు లేవు
అయినను పోయి రావాలె హస్తినకు’’ అంటూ సీఎం పై కేటీఆర్ సెటైర్లు వేశారు.

Read Also : Prabhas : మలయాళ భామతో ప్రభాస్ రొమాన్స్..!