Site icon HashtagU Telugu

KTR vs Revanth : కేటీఆర్.. రేవంత్ ను భలే సామెతతో పోల్చడే..!!

Ktr Revanth War

Ktr Revanth War

తెలంగాణ లో కాంగ్రెస్ vs బిఆర్ఎస్ పార్టీల (Congress vs BRS) మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పిక్ స్టేజ్ కి వెళ్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు కావొస్తున్నా..ఇంతవరకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. అమలు చేసిన హామీలను సైతం పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. ముఖ్యంగా రుణమాఫీ విషయంలో చెప్పింది ఒకటి..చేసింది ఒకటి. కేవలం 25 % మందికే రుణమాఫీ చేసి..అందరికి చేశామని ప్రచారం చేస్తూ వస్తుందని..గ్యారెంటీలు అమలు చేయలేకపోగా, అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, రైతు బంధు ఊసే లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, కొత్త ప్రాజెక్ట్ లు లేవు, ఇలా ఏమి అమలు చేయకుండా కాలక్షేపం చేస్తుందని బిఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ముఖ్యంగా మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇల్లు కూల్చడం పై గత కొద్దీ రోజులుగా వార్ కొనసాగిస్తోంది.

తాజాగా ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన ఆగదన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్పై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి ప‌ది నెల‌లు అవుతున్నా.. ఒక్క సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కం అమ‌లుకు నోచుకోలేదు. రేవంత్ ప‌రిపాల‌న ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే అన్న చందంగా త‌యారైంది. ఏ ఒక్క వ‌ర్గానికి కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సంక్షేమ ప‌థ‌కం అందలేదంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసారు. మింగ మెతుకు లేదు.. కానీ మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలె అన్నట్టునది రేవంత్ వైఖరి అని కేటీఆర్ విమ‌ర్శించారు. తెల్లారి లేస్తే బీద అరుపులు. రాష్ట్రం అప్పులపాలైంది అని, డబ్బులు లేవని. మరొకవైపు మూసీ పేరిట ఈ లక్ష యాభై వేల కోట్ల సోకులు, ఆర్భాటం ఎవరికోసం? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

Read Also : Houseplants In Bottles: ఈ 5 మొక్కలు మట్టిలో కాకుండా నీటిలో పెరుగుతాయి!