తెలంగాణలో ఫార్ములా ఈ రేస్(Formula E-Car Race Case)కు సంబంధించిన నిధుల ఖర్చు అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కు ఏసీబీ నోటీసులు (ACB Notice) జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 16వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని కోరుతూ నోటీసులు పంపారు. ఈ నోటీసు పై స్పందించిన కేటీఆర్, తన పాలన దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ద్వారా విమర్శల నుండి తప్పించుకోవాలనే కుతంత్రంలో సీఎం రేవంత్ రెడ్డి నిమగ్నమయ్యారని మండిపడ్డారు. గతంలో ఫార్ములా ఈ సంస్థకు హెచ్ఎండిఏ ఖాతా నుంచి పారదర్శకంగా 44 కోట్లు పంపామని అవి ఇప్పటికీ ఆ సంస్థ ఖాతాలోనే ఉన్నాయని, కానీ వాటిని వెనక్కి రప్పించలేని తన వైఫల్యాన్ని దాచేందుకు రేవంత్ ఇటువంటి రాజకీయ నాటకాలు చేస్తున్నాడన్నారు.
CM Revanth: ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
తనకు ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా, విచారణలు నిర్వహించినా ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన వ్యవహారం పూర్తిగా పారదర్శకమేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా నోటుకు ఓటు కేసులో నల్లబ్యాగుతో పట్టుబడిన సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఏసీబీ విచారణ పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. ఇద్దరిపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమని, రేవంత్ రెడ్డిని కూడా అదే పరీక్ష ఎదుర్కొనాలని సవాల్ విసిరారు. ప్రజల ముందే నిజం ఏంటో తేల్చాలని అన్నారు.
Plane Crash : విమాన ప్రమాదం..బ్లాక్‌బాక్స్ లభ్యం.. కీలక సమాచారంపై ఉత్కంఠ..!
కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి తన పాలనా వైఫల్యాలనుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు విచారణల పేరుతో బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. ఫార్ములా ఈ రేసింగ్ ద్వారా రాష్ట్రానికి ఖ్యాతి వచ్చింది, పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేస్తూ, ఇది కేటీఆర్ చేసిన ప్రయత్నాల ఫలమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించి రాష్ట్ర పరువును మంటగలిపిన నేపథ్యంలో, బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే తప్ప క్రైం చేసిందేమీ లేదని హరీష్ రావు తేల్చిచెప్పారు.