Site icon HashtagU Telugu

Goat Business : తెలంగాణ లో సీఎం రేవంత్ ‘మేకల’ వ్యాపారం మొదలుపెట్టాడు – కేటీఆర్

Boycotting orientation session of legislators: KTR

Boycotting orientation session of legislators: KTR

తెలంగాణాలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మేకల వ్యాపారం (Goat Business) చేస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేసారు కేటీఆర్. ప్రస్తుతం ఢిల్లీ టూర్ (KTR Delhi Tour) లో బిజీ గా ఉన్న కేటీఆర్..ఈరోజు జాతీయ మీడియా తో మాట్లాడుతూ..రీసెంట్ గా ఖర్గే చేసిన వ్యాఖ్యలపై (Kharge Comments) సెటైర్లు వేశారు. ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రధాని మోదీ ఎమ్మెల్యేలను గొర్రెలు కొన్నట్లు కొంటున్నారని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే రీసెంట్ గా వ్యాఖ్యలు చేయగా..దానికి కేటీఆర్ స్పందించారు.

ఖర్గే ఒకసారి తెలంగాణ వచ్చి చూస్తే.. ఇక్కడ గొర్రెల వ్యాపారం ఎంత బాగా నడుస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారని, అతి పెద్ద గొర్రెల కొనుగోలుదారుడిని అందించినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. మీ ముఖ్యమంత్రి మా (బీఆర్ఎస్) ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుతున్నారని విమర్శించారు. తెలంగాణ మేకల మార్కెట్‌కు తాను ఖర్గేను స్వాగతిస్తున్నానన్నారు. ఇప్పటికే తమ పార్టీకి చెందిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారన్నారు. ఖర్గే గారు, దేశంలోనే అతిపెద్ద మేకల కొనుగోలు మార్కెట్ కాంగ్రెస్‌దే అన్నారు. అసలు ఆయారాం… గయారాం సంస్కృతిని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో వారికి కూడా తెలియని దయనీయ పరిస్థితి ఉందని విమర్శించారు. వారిని ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో నిలబెట్టి దీనిపై అడగాలని ఖర్గేను డిమాండ్‌ చేశారు. వాళ్లందరూ కూడా కోర్టులకు, తమ పదవి పోతుందేమోనని గజగజ వణికిపోతున్నారని తెలిపారు.

Read Also : Air India : బంఫర్ ఆఫర్..రూ.1444కే విమాన టిక్కెట్‌..