KTR Phone call : ఓటర్లకు స్వయంగా ఫోన్ చేసి..బిఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరుతున్న కేటీఆర్

బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ.. మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
Ktr Phonecall

Ktr Phonecall

తెలంగాణ ఎన్నికల ప్రచారం (Telangana Election Campgin) ముగింపు దశకు వచ్చింది. మరి కొద్దీ గంటల్లో మైకులన్నీ మూతపడబోతున్నాయి. గత నెల రోజులుగా ఉదయం లేచిన దగ్గరి నుండి బిఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ (Congress) , బిజెపి లతో పాటు చిన్న చితక పార్టీలన్నీ కూడా తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అంతే కాదు ప్రతి రోజు ఇంటికి అన్ని పార్టీల నేతలు వచ్చి తమకు ఓటు వేయాలని కోరుతూ వచ్చారు. ఇక రేపు సాయంత్రం తరువాత ఏ పాట వినిపించదు..ఏ మైకు మోగదు..ఏ నేత ఇంటికి రారు..అంత సైలెంట్ అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఉన్న ఈ కొద్దీ సమయంలో ఓటర్లను మరింతగా ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా మొదటి నుండి ప్రచారం లో దూకుడు గా ఉన్న మంత్రి కేటీఆర్..తాజాగా ఓటర్లకు స్వయంగా ఫోన్ చేసి బిఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు సభలు , సమావేశాలు , మెట్రో ప్రచారం, యూట్యూబ్ , న్యూస్ చానెల్స్ ఇలా ఏ ఫ్లాట్ ఫామ్ ను వదిలిపెట్టకుండా ప్రచారం చేస్తూ వచ్చిన కేటీఆర్..ఇక ఇప్పుడు ఓటర్లకు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. తాను పోటీ చేస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంతో పాటు హైదరాబాద్‌ వాసులకు కూడా ఫోన్లు చేస్తున్నారు. అంత టైం ..ఓపిక కేటీఆర్ కు ఉందా అని ఆశ్చర్యపోకండి. ప్రస్తుతం అంత టెక్నాలజీ యుగం కదా..అంత వాటితోనే నడుస్తుంది.

ఐటీ మినిస్టర్ కేటీఆర్ సైతం టెక్నలాజి ని వాడుకుంటున్నారు. IVRS కాల్ ద్వారా నేరుగా ఓటర్లకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ.. మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే సిరిసిల్ల నియోజకవర్గ ఓటర్లతో పాటు హైదరాబాద్‌ ఓటర్లకు కూడా చాలా మంది కేటీఆర్ పోన్ కాల్ వచ్చింది. ఇప్పటికే బీఆర్ఎస్ పేరుతో వాట్సప్‌ ద్వారా సందేశాలు పంపిస్తోన్న గులాబీ పార్టీ.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు కూడా కేటీఆర్ ఫోన్ కాల్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే.. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థుల గొంతుతో ఓటర్లకు IVRS కాల్స్‌ చేస్తుండగా.. ఇప్పుడు కేటీఆర్ కూడా చేస్తుండటం గమనార్హం.

Read Also : Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నకు అవమానం.. గెంటేసిన ప్రియాంక సెక్యూరిటీ

  Last Updated: 27 Nov 2023, 06:45 PM IST