తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామంగా తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna), బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుల భేటీ మారింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన మల్లన్న, ఇప్పుడు అదే పార్టీలో కీలక నేతలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, పాలనను ఎండగట్టిన మల్లన్న, చివరకు జైలుకూ వెళ్లారు. కానీ జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా తన విమర్శలను కొనసాగించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించి ఎమ్మెల్సీ స్థానం దక్కించుకున్న మల్లన్న, ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
GMR Vs Central Govt: కేంద్ర సర్కారుపై ఢిల్లీ ఎయిర్‌పోర్టు దావా.. ఎందుకు ?
తాజాగా బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా తీన్మార్ మల్లన్న, కేటీఆర్, హరీష్ రావులను కలిశారు. ఢిల్లీలో బీసీల హక్కుల కోసం తలపెట్టిన ధర్నాకు సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు బీఆర్ఎస్‌ను తీవ్రంగా విమర్శించిన మల్లన్న, ఇప్పుడు ఆ పార్టీ నేతలతో చర్చలు జరపడం రాజకీయ సమీకరణాల్లో మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు, ఆ తర్వాత బహిష్కరణ, ఇక మళ్లీ బీఆర్ఎస్ వైపు అడుగులు వేయడం… ఇవన్నీ రాజకీయాల్లో ఊహించలేని మలుపులను సూచిస్తున్నాయి.
ఈ భేటీ వెనుక అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తీన్మార్ మల్లన్న భవిష్యత్ రాజకీయ ప్రణాళిక, బీసీ రిజర్వేషన్‌పై పోరాటం, రాబోయే ఎన్నికల్లో కొత్త పొత్తులు – ఇవన్నీ ఈ సమావేశానికి ప్రేరణ కావొచ్చు. ఇదిలా ఉంటె ఈ భేటీతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నేతల మధ్య భవిష్యత్‌లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, మల్లన్న రాజకీయ ప్రయాణం ఏ దిశగా సాగుతుందో చూడాల్సిందే.
Janhvi Kapoor Reflects on 4 Years of #Roohi and Her First Solo Dance Number