Site icon HashtagU Telugu

Telangana: పదేళ్ల తెలంగాణ ప్రగతిని ఆవిష్కరించిన కేటీఆర్

Telangana

New Web Story Copy 2023 07 05t173346.784

Telangana: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి పదేళ్లు కావొస్తుంది. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చి పడ్డాయి. హైదరాబాద్ నగరం ఐటీతో కళకళలాడుతుంది. ఈ సందర్భంగా ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన నివేదికను విడుదల చేశారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కెటి రామారావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే ఈ పదేళ్ల కాలంలో 4 రెట్లు పెరిగినట్టు కేటీఆర్ నివేదికలో వెల్లడించారు. మొత్తం మూలధన పెట్టుబడికి తెలంగాణ ప్రభుత్వం 91.8 శాతం విరాళంగా అందించగా, ఇందులో కేంద్రం సహకారం రూ. 9,934 కోట్లుగా పేర్కొన్నారు.

నివేదిక ప్రకారం తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 1.21 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. నివేదికను ఆవిష్కరించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ… సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, వాయు కాలుష్యం వంటి సవాళ్లను మంత్రిత్వ శాఖ చురుగ్గా ఎదుర్కొన్నదని, దీనికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు మంత్రి కేటీఆర్.

Read More: Shoes Theft: విచిత్ర దొంగలు.. తుపాకి గురిపెట్టారు, బూట్లు దొంగిలించారు!