Site icon HashtagU Telugu

KTR: దుబాయ్ లో కేటీఆర్ బిజీ బిజీ, తెలంగాణకు మరో 1600 కోట్ల పెట్టుబడులు!

Ktr

Ktr

తెలంగాణ మంత్రి కె.టి. రామారావు ఎన్నికల ముంగిట విదేశీ పర్యటనలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అమెరికాలో పర్యటించిన దుబాయ్ లో బిజీబిజీగా పర్యటనలు చేస్తున్నారు. ఈ మేరకు  దుబాయ్‌లో పలువురు వ్యాపార పెద్దలను కలుసుకున్నారు. అయితే పెట్టుబడుల కోసమే కేటీఆర్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రస్తావిస్తుండగా, ఎన్నికల ఖర్చు కోసమే కేటీఆర్ తరచుగా విదేశాలకు చక్కర్లు కొడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అయితే దుబాయ్ పర్యటనలోనూ మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేలా మంత్రి కేటీఆర్ చొరవ చూపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి దుబాయ్‌కు చెందిన కంపెనీలతో చర్చల జరిపారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఫార్మా సిటీతో సహా పారిశ్రామిక పార్కుల్లో అత్యుత్తమ శీతలీకరణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రముఖ కూలింగ్ యుటిలిటీ ప్లేయర్ అయిన తబ్రీద్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

రాష్ట్రంలో రూ. 1,600 కోట్ల పెట్టుబడి పెట్టనున్న తబ్రీద్, 125,000 RT (శీతలీకరణ టోన్లు) జిల్లా కూలింగ్ ప్లాంట్లు,  నెట్‌వర్క్‌లను $200 మిలియన్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మరింత సుస్థిర భవిష్యత్తు వైపు ప్రయాణం సాగించడం కోసం తబ్రీద్‌తో భాగస్వామ్యం కావడం మాకు ఆనందంగా ఉంది. తబ్రీద్ చైర్మన్ ఖలీద్ అబ్దుల్లా అల్ ఖుబైసీ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వంతో సహకారం సుస్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడాన్ని ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు. ఇప్పటికే ఐటీ రంగంలో దేశానికి దిక్సూచీగా నిలుస్తున్న తెలంగాణ ఇతర రంగాల్లోనూ ఆదర్శంగా నిలువబోతుందని అన్నారు.

Also Read: BRS Minister: స‌చ్చేదాకా సార్ తోనే ఉంటాం!