Site icon HashtagU Telugu

Hattrick Loading 3.0 : ఉత్కంఠ రేపుతున్న కేటీఆర్ ‘హ్యాట్రిక్ లోడింగ్ 3.0’ ట్వీట్ ..

Ktr Loading Tweet

Ktr Loading Tweet

రేపు (December 03) ఏంజరగబోతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. తెలంగాణ ఎన్నికల ఫలితాల (Telangana Election Results)పై రాజకీయ విశ్లేషకులు సైతం అయోమయం అవుతున్నారు. ఓ పక్క ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి జై కొడుతుంటే..బిఆర్ఎస్ నేతలు మాత్రం హ్యాట్రిక్ కొట్టబోతున్నాం..సంబరాలకు సిద్ధం కండి అని భరోసా ఇస్తున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ దగ్గరి నుండి గల్లీ బిఆర్ఎస్ నేతల వరకు అంత మాదే విజయం రాసిపెట్టుకోండి అంతే..అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇరు పార్టీల ధీమాల తో రాష్ట్ర ప్రజలే కాదు దేశ వ్యాప్తంగా తెలుగు ప్రజలు అయోమయానికి గురి అవుతున్నారు. అసలు రేపు ఏంజరగబోతుందో అనే ఉత్కంఠ అందరిలో ఎక్కువ అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..మంత్రి కేటీఆర్ (KTR) మరికొద్ది గంటల్లో ఫలితాలు వెల్లడికానున్న తరుణంలో ఆసక్తికర ట్వీట్ చేసి మరింత షాక్ ఇచ్చారు. హ్యాట్రిక్ లోడింగ్ 3.0. సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ ట్వీట్ చేయడమే కాదు..గన్ గురిపెట్టినట్లుగా ఉన్న తన ఫోటోను జత చేసాడు. ఇప్పుడు సోషల్ మీడియా లోనే కాదు రాజకీయాల్లో వైరల్ గా మారింది.

అంతకు ముందు ఎన్నికల పోలింగ్ అనంతరం కూడా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. 70 సీట్లతో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేసారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీకే వస్తాయని ప్రకటించాయి. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్‌పై కేటీఆర్ స్పందిస్తూ నిజమైన ఫలితాలు డిసెంబర్-03న వస్తాయని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తేల్చిచెప్పారు. సర్వేలు తప్పని తేలితే క్షమాపణలు చెబుతారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ లోడింగ్ 3.0. సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ ట్వీట్ చేయడం ఇలా వరుస ధీమా లతో బిఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుంది.

Read Also : Uttam Kumar : కాంగ్రెస్ గెలుపు ఖాయం..నేను గడ్డం తీయడం ఖాయం – ఉత్తమ్