Site icon HashtagU Telugu

KCR Health : కేసీఆర్ ఆరోగ్యం ఫై కేటీఆర్ కీలక సమాచారం…

Cm Kcr Health Belletin

Cm Kcr Health Belletin

గత నాల్గు వారాలుగా కేసీఆర్ (KCR) మీడియా ముందుకు రాకపోవడం..ఆయన ఆరోగ్యం (kcr health) ఫై అనేక వార్తలు ప్రచారం అవుతుండడం తో బిఆర్ఎస్ శ్రేణులు (BRS) ఆందోళన పడుతున్నారు. కేసీఆర్ కు ఏమైంది..? ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు..? వైరల్ ఫీవర్ అయితే ఇన్ని రోజులా..? కేటీఆర్ ఏమో రీసెంట్ గా కేసీఆర్‌కు ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ (Chest Infection)..అయ్యింది. మరికొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పాడు. కేటీఆర్ ఈ వార్త చెప్పేసరికి మరింత ఆందోళన పెరిగింది. అసలే ఎన్నికల సమయం..ఎన్నికల డేట్ కు వచ్చేసింది..రెండు నెలలు కూడా ఎన్నికలకు సమయం లేదు. ఈ సమయంలో కేసీఆర్ మీడియా ముందుకు రాకవడం..అనారోగ్యం బారినపడడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన ఎక్కవుతుంది. ఈ తరుణంలో కేసీఆర్ అర్యోగం ఫై కేటీఆర్ మరోసారి స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

సీఎం కేసీఆర్ జబర్దస్త్ గా ఉన్నాడు.. మనకోసం లోపల కూర్చొని అన్ని చేస్తున్నాడు.. త్వరలో బయటికి వచ్చి అన్ని ప్రకటనలు చేస్తారు.. సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్లలో చేసిన పనులు మీ కళ్ల ముందున్నాయి.. ఒక్క ఛాన్స్ ఇవ్వండని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు.. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో అడగండి.. కాంగ్రెస్ అధికారం వస్తే మళ్లీ కష్టాలు వస్తాయి అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. సోమవారం మంత్రి కేటీఆర్ (Minister KTR) భూపాలపల్లి (Bhupalapally) జిల్లాలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. కేసీఆర్ అనారోగ్యం బారినపడిన దగ్గరి నుండి అభివృద్ధి పనుల్లాన్ని కేటీఆర్ చూసుకుంటున్నారు. ప్రతి రోజు ఏదోక జిల్లాలో పర్యటిస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ వస్తున్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీల ఫై నిప్పులు చెరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

Read Also : KL Rahul: టెస్టు క్రికెట్‌ ఆడాలని కోహ్లీ చెప్పాడు, నేను అదే ఫాలో అయ్యా: కేఎల్ రాహుల్