KTR – Rahul : అవినీతిపై రాహుల్ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉంది – కేటీఆర్

స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ అవసరం లేదని గాంధీజీ అన్నారు. ఇలాంటి వారు కాంగ్రెస్ లో ఉంటారని ఆయన ఆనాడే ఊహించారేమో.? పీసీసీ పోస్టును రూ.50 కోట్లకు అమ్మారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Published By: HashtagU Telugu Desk
KT Rama Rao

Telangana Minister KTR America Tour

రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫై మంత్రి కేటీఆర్ (KTR) సైటైర్లు వేశారు. అవినీతిపై రాహుల్ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ..తెలంగాణ ఎన్నికల ప్రచారం లో బిజీ బిజీ గా ఉన్నారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తూ..బిఆర్ఎస్ , బిజెపి లపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ (KTR Twitter) వేదిక గా రాహుల్ ఫై సాత్రిలు వేశారు.

‘టికెట్లు అమ్ముకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై కాంగ్రెస్ నేతలే ఈడీకి ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు కేసులో ఆయన ఇప్పటికే పట్టుబడ్డాడు. స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ అవసరం లేదని గాంధీజీ అన్నారు. ఇలాంటి వారు కాంగ్రెస్ లో ఉంటారని ఆయన ఆనాడే ఊహించారేమో.? పీసీసీ పోస్టును రూ.50 కోట్లకు అమ్మారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఒకరు పీసీసీ పోస్టును విక్రయిస్తే మరొకరు కొనుగోలు చేశారు. ఇంతటి అవినీతి పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ, అక్రమాలపై మాట్లాడడం హాస్యాస్పదం.’ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోపక్క రాహుల్ తన ప్రసంగాలతో ప్రజల్లో ఉత్తేజం నింపుతూ..బిఆర్ఎస్ (BRS) ఫై విమర్శలు కురిపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మూతపడ్డ చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించి రైతులను ఆదుకుంటామని జగిత్యాల సభలో రాహుల్ స్పష్టం చేశారు. క్వింటా పసుపుకు రూ.12వేలు ధర కల్పిస్తామన్నారు. తెలంగాణ ప్రజలతో తనకున్నది రాజకీయ బంధం కాదని.. ప్రేమానుబంధమని.. ఈ అనుబంధం ఈనాటిది కాదని… నెహ్రూ, ఇందిరమ్మ నుంచి కొనసాగుతోందని అన్నారు. తాను బీజేపీపై పోరాటం చేస్తుంటే… తనపై కేసులు పెట్టారని, లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారని.. తనను ఇంటి నుంచి బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇల్లు భారత ప్రజలని.. తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉందని, తనను ఇంటి నుంచి బయటకు పంపించగలరేమో.. కానీ ప్రజల హృదయాల్లోంచి కాదని అన్నారు. దేశ సంపదను ప్రధాని మోదీ ఆదానీకి కట్టబెడుతున్నారని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే.. ఇక్కడ కూడా బీసీ కులగణన చేపడతామన్నారు.

Read Also : Rahul Gandhi : జగిత్యాల సభలో బిఆర్ఎస్ ఫై రాహుల్ ఘాటైన విమర్శలు

  Last Updated: 20 Oct 2023, 01:01 PM IST