Site icon HashtagU Telugu

KTR : కేసీఆర్ కరెంట్ ఇస్తున్నాడో లేదో ఓసారి రేవంత్.. వైర్లు పట్టుకుంటే తెలుస్తుంది – కేటీఆర్

Ktr Revanth

Ktr Revanth

తెలంగాణ ఎన్నికల ప్రచారం (Telangana Election Campaign)లో ఏ నేత తగ్గడం లేదు..తమ గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తూ ప్రత్యర్థి పార్టీల ఫై నేతలపై సినిమా డైలాగ్స్ ను వదులుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) రోడ్ షో లలో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా రేవంత్ ఫై కేటీఆర్ విరుచుకపడుతున్నాడు. 24 గంటల కరెంట్ ఫై రేవంత్ (Revanth Reddy) చేస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తుంటే లేదని రేవంత్ రెడ్డి అంటున్నాడు..ఓ సారి కరెంట్ వైర్లు పట్టుకుంటే తెలుస్తుందని మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రచారంలో మంచిర్యాల జిల్లాలో పర్యటించిన కేటీఆర్. మంచిర్యాలకు మెడికల్ కాలేజీ తెచ్చింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ఐటి హబ్ కావాలా …పేకాట క్లబ్ కావాలా… అని ప్రశ్నించారు. స్కీంలు కావాలంటే కారుకు స్కాంలు కావాలంటే కాంగ్రెస్ కి వేయండని తెలిపారు. అలాగే రేవంత్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు లు కరెంట్ వైర్లు పట్టుకుంటే..కేసీఆర్ కరెంట్ ఇస్తున్నాడో లేదో తెలుస్తుందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులకు జాగారమే అని కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించండి అని చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. రేవంత్ ది వ్యవసాయం చేసిన మొఖమేనా? అని ప్రశ్నించారు. గజ్వేల్ లో కాంగ్రెస్ అభ్యర్థి పత్తా లేడని వ్యంగాస్త్రం వేశారు. సిద్దిపేటలో నాకు లక్ష మెజారిటీ ఇచ్చారని అన్నారు. గజ్వేల్ లో పెద్ద సారు కేసీఆర్ కి నాకంటే ఎక్కువ మెజారిటీ ఇవ్వాలన్నారు. బూతులు మాట్లాడే నాయకులకు పోలింగ్ బూత్ లో మీ ఓట్లతో సమాధానాలు ఇవ్వండి అని మంత్రి అన్నారు. పెద్ద మనిషిని పట్టుకుని ఒకటే బూతులు తిడుతున్నారని అన్నారు. కటిక వేస్తే వచ్చే కరెంట్ కావాలా..? కటిక చీకట్ల కాంగ్రెస్ కరెంట్ కావాలా..?అని ప్రశ్నించారు. కర్ణాటక లో కాంగ్రెస్ వచ్చాక మూడు గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. రేవంత్ రెడ్డి 10HP మోటర్ కొనాలి అంటున్నారని తెలిపారు. రేవంత్ ది వ్యవసాయం చేసిన మొఖమేనా? అని ప్రశ్నించారు. పొరపాటున కాంగ్రెస్ కి ఓటేస్తే మూడు గంటల కరెంట్ వస్తుందని అన్నారు.

Read Also : Congress Abhaya Hastham : జర్నలిస్టులఫై కాంగ్రెస్ వరాల జల్లు

Exit mobile version