తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender Unparliamentary Language in assembly) చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి దానం నాగేందర్ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. ఏయ్ నోర్ముయ్ .. ‘నీ అమ్మ ముసుకో’ అంటూ తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు. దీంతో దానం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కాసేపు అసెంబ్లీ లో ఉద్రిక్త పరిస్థితి చెలరేగింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాదరావు జోక్యం చేసుకుని దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. దీంతో స్పీకర్ సూచనల మేరకు దానం నాగేందర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి, విచారం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అసెంబ్లీ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని యావత్ ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
దానం వ్యాఖ్యలపై కేటీఆర్ , హరీష్ రావు లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ శాసనసభ దుశ్శాసనభగా మారిందని హరీశ్‌రావు అన్నారు. సభ్యసమాజం తలదించుకునే విధంగా శాసనసభలో వ్యవహారాలు నడుస్తున్నాయని , ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కే గౌరవం ఇదేనా అని హరీశ్ రావు ప్రశ్నించారు. నిన్న మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచారని… ఇవాళ ఈ దేశంలోని మహిళామూర్తులు, కన్నతల్లులను అవమానపరిచేలా శాసనసభలో సభ్యులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సభా నాయకుడే సభలో ఉండి ఈరకంగా బీఆర్‌ఎస్ పార్టీని, ఎమ్మెల్యేలను తిట్టించే ప్రయత్నం చేయడం ఏరకంగా సమంజసమని ప్రశ్నించారు. అది మనుషులు మాట్లాడే భాష కాదు పశువులు మాట్లాడే భాష అని దానం నాగేందర్‌పై హరీశ్‌రావు మండిపడ్డారు . ఒక రౌడీ షీటర్లు బయట మాట్లాడే భాషను శాసనసభ్యుడు సభలో మాట్లాడటం తగునా అని ప్రశ్నించారు. ఇదే అంశంపై కేటీఆర్ మాట్లాడుతూ..ఇది అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. ‘మమ్మల్ని ‘అమ్మ.. అక్క’ అని తిడుతుంటే సీఎం రేవంత్ పైశాచికానందం పొందుతున్నారు. అందర్నీ ఉసిగొల్పుతున్నారు. ఆయన చీఫ్ మినిస్టర్ కాదు. చీప్ మినిస్టర్. యువత రేవంతు తగిన సమాధానం చెప్పే టైమ్ త్వరలోనే వస్తుంది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Read Also : Hyderabad: రెండో తరగతి బాలికపై 9వ తరగతి విద్యార్థి లైంగిక వేధింపులు