Congress Party : కాంగ్రెస్‌కు ఓటేస్తే మన ఇళ్లను కూల్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే – KTR

Congress Party : GHMC ఎన్నికల తర్వాత ఉచిత మంచినీళ్లను ఆపేస్తారని హెచ్చరించారు. జూబ్లీహిల్స్‌ బస్తీల ప్రజలు ఈసారి కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతూ, బీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు

Published By: HashtagU Telugu Desk
Ktr

Ktr

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేటలో బోరబండ డివిజన్ బూత్‌ స్థాయి సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ.. పేదల ఇండ్లపై హైడ్రా (Hydraa) బుల్డోజర్‌ను నడిపిస్తున్నారని, ఇది కేవలం బలహీన వర్గాలపైనే దాడి చేస్తున్నదని ఆరోపించారు. గాజులరామారంలో పేదల ఇండ్లను ఆదివారం సెలవు రోజే కూల్చివేయడం తీరని అన్యాయమని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో సీఎం సోదరుడు, కొంతమంది మంత్రులు చెరువులపై, ప్రభుత్వ స్థలాలపై కట్టుకున్న ఇళ్లపై మాత్రం చర్యలు తీసుకోకపోవడం ద్వంద్వ వైఖరిని చూపుతోందని కేటీఆర్‌ విమర్శించారు.

Attack : సొంత ప్రజలపైనే పాక్ బాంబుల దాడి

తెలంగాణ అభివృద్ధిలో బీఆర్‌ఎస్‌ (BRS) చేసిన పనులను గుర్తుచేస్తూ కేటీఆర్‌ కాంగ్రెస్‌–బీజేపీలను ఒకటే అన్నార. పదేళ్లలో 42 ఫ్లైఓవర్లు, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి, హైదరాబాద్‌ను కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడే ప్రారంభిస్తున్న ప్రాజెక్టులు వాస్తవానికి బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించబడినవేనని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి జెండా కాంగ్రెస్‌ అయినా, అసలు ఎజెండా మాత్రం బీజేపీదేనని కేటీఆర్‌ విమర్శించారు. మతాల పేరుతో ప్రజల్లో చిచ్చుపెట్టడం, తప్పుడు హామీలతో ఓట్లు అడగడం మాత్రమే ఈ రెండు పార్టీల విధానమని ఆయన పేర్కొన్నారు.

అలాగే ప్రధాని మోదీపై కూడా కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. ఎప్పటికప్పుడు గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్ ధరలు పెంచి ఇప్పుడు జీఎస్టీ తగ్గించామని పండుగ చేసుకోవాలని చెప్పడం ప్రజలపై అవమానమని అన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడాయో ప్రశ్నించారు. GHMC ఎన్నికల తర్వాత ఉచిత మంచినీళ్లను ఆపేస్తారని హెచ్చరించారు. జూబ్లీహిల్స్‌ బస్తీల ప్రజలు ఈసారి కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతూ, బీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పుడు హామీలకు లొంగకుండా, అభివృద్ధిని కొనసాగించేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

  Last Updated: 22 Sep 2025, 04:35 PM IST