KTR : విద్యార్థులకు బెస్ట్ విషెష్ తెలుపుతూ కేటీఆర్ గిఫ్ట్స్ ..

మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. గిఫ్ట్ (Gift) అనేది ఎంత పెద్దది..ఎంత ఖరీదైంది కాదు..వారి అవసరాన్ని తీర్చేదయి ఉండాలి..అప్పుడే తీసుకున్న వారికీ , ఇచ్చే వారికీ సంతృప్తి ఉంటుంది. ఇదే కేటీఆర్ చేసారు. త్వరలో 10 వ తరగతి పరీక్షలు మొదలుకాబోతున్నాయి. ఈ తరుణంలో తన నియోజకవర్గంలోని 10 వ తరగతి విద్యార్థులకు ఎక్సమ్ ప్యాడ్ తో పాటు పెన్నులను గిఫ్ట్ గా పంపించి వారిలో సంతోషం నింపారు. దాదాపు […]

Published By: HashtagU Telugu Desk
Ktr Gift

Ktr Gift

మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. గిఫ్ట్ (Gift) అనేది ఎంత పెద్దది..ఎంత ఖరీదైంది కాదు..వారి అవసరాన్ని తీర్చేదయి ఉండాలి..అప్పుడే తీసుకున్న వారికీ , ఇచ్చే వారికీ సంతృప్తి ఉంటుంది. ఇదే కేటీఆర్ చేసారు. త్వరలో 10 వ తరగతి పరీక్షలు మొదలుకాబోతున్నాయి. ఈ తరుణంలో తన నియోజకవర్గంలోని 10 వ తరగతి విద్యార్థులకు ఎక్సమ్ ప్యాడ్ తో పాటు పెన్నులను గిఫ్ట్ గా పంపించి వారిలో సంతోషం నింపారు. దాదాపు 3000 మంది విద్యార్థులకు వీటిని పంపించినట్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. ‘Small gesture may be, but something that made me 😊’ అంటూ రాసుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇవే కాదు గతంలోనూ కేటీఆర్ రాజకీయాలతో సంబంధం లేకుండా ఎంతోమందికి సహాయం (Help) చేసారు. అర్ధరాత్రి , అపరాత్రి అనే తేడాలేకుండా రామయ్య..ఆదుకోవయ్యా అంటే చాలు అప్పటికప్పుడు వారి ఆపదను తెలుసుకొని సాయం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కేవలం తన దగ్గరికి వచ్చి సాయం అడిగిన వారికే కాదు సోషల్ మీడియా లో ఒక్క ట్వీట్ చేసి సాయం కోరిన వారికీ కూడా తక్షణం సాయం అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు. ప్రస్తుతం తమ పార్టీ అధికారంలో లేనప్పటికీ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారికీ అండగా ఉంటున్నారు. ఓ పక్క ప్రజల కష్టాలకు అండగా ఉంటూనే..అధికార పార్టీ కాంగ్రెస్ ఫై విమర్శలు చేస్తూ వారి బాధ్యతను గుర్తుచేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఏది ఏమైనప్పటికి రామయ్య చేసే పనులకు పార్టీ శ్రేణులే కాదు..ఆయనను అభిమానించే వారు సైతం ఫిదా అవుతున్నారు.

Read Also : TS : కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కేటిఆర్ ఓర్వలేక పోతున్నాడు – మల్లు రవి

  Last Updated: 26 Feb 2024, 03:37 PM IST