Site icon HashtagU Telugu

SLBC Tunnel Accident : జ్యుడిషీయ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటుకు కేటీఆర్ డిమాండ్

Ktr Demands Formation Of Ju

Ktr Demands Formation Of Ju

ఎస్ఎల్‌బీసీ సొరంగంలో చోటుచేసుకున్న ప్రమాదం(SLBC Tunnel Accident)పై జ్యుడిషీయల్ కమిషన్ (Judicial Commission) ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒకవైపు సహాయ చర్యలను వేగవంతంగా కొనసాగిస్తూనే, ప్రమాదానికి బాధ్యులైన వారిపై దర్యాప్తు చేపట్టాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని, తాజాగా ఎస్ఎల్‌బీసీ సొరంగ ఘటన వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల ఆర్థిక నష్టం జరిగినట్టు కేటీఆర్ (KTR) పేర్కొన్నారు.

OFF TRACK : ‘ఎమ్మెల్సీ’ కోసం కాంగ్రెస్ నేతల లాబీయింగ్.. కవితకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. టీడీపీలో షాకింగ్ రాజీనామా

గతంలో సుంకిశాల, పెద్దవాగు ప్రమాదాలు జరిగినప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేయలేదని, బాధ్యులపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు గతంలో అనేక విషయాలపై న్యాయ కమిషన్‌ల ఏర్పాటు కోసం డిమాండ్ చేశారు అని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం విచారణ చేపట్టకపోవడం తగదని తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

SLBC Tunnel: ‘సొరంగ’ ప్రమాదానికి రాజకీయ ‘విపత్తు’!

సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ, ఇతర సహాయ సంస్థల సహకారం తీసుకోవాలని కేటీఆర్ అన్నారు. ఎస్ఎల్‌బీసీ ప్రమాదం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ప్రభుత్వం మరింత చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించగలుగుతామని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.