SLBC Tunnel Accident : SLBC టన్నెల్ ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వ మంత్రి వర్గ సభ్యులు అనుసరిస్తున్న విధానం నిర్లక్ష్యంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికే ఘటన జరిగి ఏడు రోజులు గడిచినప్పటికీ, అధికారికంగా స్పష్టమైన ప్రకటన లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. కార్మికుల కుటుంబాలు వారి ఆచూకీ కోసం వేచి చూస్తున్న సమయంలో ప్రతీ మంత్రి, ఎమ్మెల్యే ఎవరికీ వారు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.
TGSRTC : బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్
ఒక ఎమ్మెల్యే మృతదేహాలు లభ్యమయ్యాయని చెబుతుండగా, మరొకరు ప్రధాని మోదీ ఎందుకు సంతాపం తెలుపడం లేదని ప్రశ్నించారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మరో మంత్రి ప్రమాదంలో ఎవరూ బ్రతికే అవకాశం లేదని వ్యాఖ్యానించడాన్ని ఆయన ‘సర్కస్’తో పోల్చారు. ఇంత తీవ్రమైన ఘటనపై అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సిన ప్రభుత్వం, ప్రతి ఒక్కరు తాము అనుకున్న విధంగా ప్రకటనలు చేస్తూ ప్రజలను మరింత గందరగోళానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ameenpur Cheruvu : అమీన్‌పూర్ పెద్దచెరువులో జేఏసీ పేరిట దందా..!
కాంగ్రెస్ నేతల పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదని, కేవలం హాస్యాస్పద డ్రామాగా మార్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి కనీసం అధికారిక ప్రకటన చేయలేరా? అని ప్రశ్నించారు. కార్మికుల ప్రాణాలకు ఈ ప్రభుత్వంలో విలువ లేదని విమర్శించారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఒక్క స్పష్టమైన అధికారిక ప్రకటన కూడా లేకపోవడం కార్మికుల కుటుంబాలను మరింత ఆందోళనకు గురిచేస్తోందని, ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.