Site icon HashtagU Telugu

KTR : రేవంత్ .. నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా..?

Congress Vs Ktr

Congress Vs Ktr

‘నువ్వు చీరకట్టుకుని ఆడపిల్లలా మంచిగా తయారై ఆర్టీసీ బస్సు ఎక్కు. నిన్ను టికెట్ కి డబ్బులు అడిగితే 6 గ్యారంటీలు అమలు కానట్టే. టికెట్ అడగకపోతే మేము 6 గ్యారంటీలు అమలు చేసినట్టే’ అంటూ కేటీఆర్ కు సలహా ఇచ్చిన సీఎం రేవంత్ ఫై..ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కౌంటర్ ఇచ్చాడు.

” రేవంత్ రెడ్డి, నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు రూ. 2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా?, తెలంగాణాలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 యేండ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు. వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెసుని బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలే. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం అని, చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం” అని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

“కేసిఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, కల్యాణ లక్ష్మి నిలిచింది, తులం బంగారం అడ్రస్ లేదు. ఫ్రీ బస్సు అని బిల్డప్, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్దాలు చేసే దుస్థితి. అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్ కు మహిళల ఓట్లడిగే హక్కు లేదని, చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదు అని అందరికి తెలిసిపోయింది” అంటూ కాంగ్రెస్ విఫలలను రాసుకొచ్చారు. మరి దీనిపై రేవంత్ కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ స్పందిస్తారా అనేది చూడాలి.

Read Also : Getup Srinu : డబ్బు తీసుకోని జనసేనకు ప్రచారం చేశారనే ప్రచారం ఫై గెటప్ శ్రీను క్లారిటీ