Site icon HashtagU Telugu

KTR : రాష్ట్రంలో రుణమాఫీ..అంతా డొల్లతనమే: కేటీఆర్‌

Ktr

Ktr

Rythu RunaMafi : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి రాష్ట్రంలో రుణమాఫీపై విమర్శలు గుప్పించారు. ఇంకో 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదు అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనతో సీఎం రేవంత్ రెడ్డి బండారం మరోసారి బయటపడిందని పేర్కొన్నారు. ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా.. మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం. 2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటి ??

Read Also: Supreme Court : తిరుమల లడ్డూపై దర్యాప్తుకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

100% రుణమాఫీ చేశామని చెప్పింది అంతా డొల్లతనమని తేలిపోయిందన్నారు. ఎన్నికల అయిన వెంటనే అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి, 10 నెలలు దాటినా ఇంకా 20 లక్షల మందికి అందలేదంటే.. అనధికారంగా ఇంకా ఎంతమంది ఉన్నారో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. నిజాలు ఒప్పుకోకుండా అందరికీ 100% రుణమాఫీ జరిగిందని గొప్పలు చెపుకోవడం ఇప్పటికైనా ఆపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రుణమాఫీ మాత్రమే కాదు సీజన్ ముగిసినప్పటికీ ఇంతవరకూ రైతుబంధు కూడా అందలేదని విమర్శలు చేశారు. ఈ మేరకు కేటీఆర్ తన ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేశారు. రెండు లక్షల రుణ‌మాఫీ పూర్త‌యిపోయింద‌న్న సీఎం మాట‌లు ప‌చ్చి అబ‌ద్ధాలు అని విమ‌ర్శించారు. చేస్తామ‌న్న రుణ‌మాఫీ ఇప్ప‌టికీ పూర్తి చేయ‌లేద‌ని, ఇవ్వాల్సిన రైతుబందు సీజ‌న్ ముగిసినా ఇవ్వ‌లేదంటూ బీఆర్ఎస్ నేత మండిప‌డ్డారు. ఇవ్వాల్సిన రైతుబంధు సీజన్ ముగిసినా ఇయ్యలేదన్నారు. రాబంధుల ప్రభుత్వం ఉండి రైతులకు ఏం లాభం రేవంత్ చేతకానితనం.. అన్నదాతలకు కోలుకోలేని శాపం అంటూ కేటీఆర్ పోస్టు చేశారు.

Read Also: Tamarind Juice: చింతపండు రసం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!