గత మూడు వారాలుగా కేసీఆర్ అనారోగ్యం (KCR Health Problem) తో బయటకు రాకపోయేసరికి చాలామంది ఎగిరెగిరి పడుతున్నారని..రేపు పులి బయటకు వస్తే..ఈరోజు ఎగిరెగిరి పడుతున్న నక్కలన్నీ మళ్లా తొర్రలకే పోతాయని కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు.
గత మూడు వారాలుగా సీఎం కేసీఆర్ (CM KCR) అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్ష నేతలు ఓ రేంజ్ లో కేసీఆర్ ఫై విమర్శలు , సెటైర్లు పేలుస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ హామీలు (Congress 6 Guarantee Schemes) ప్రకటించడం తో కేసీఆర్ కు చలి జ్వరం వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ విమర్శిస్తే..పసుపు బోర్డు (Turmeric Board) ప్రకటించేసరికి కేసీఆర్ ముఖం చూపించుకోలేకపోతున్నారని బిజెపి విమర్శలు చేస్తున్నారు. ఇలా వరుసగా ప్రతిపక్ష నేతలు కేసీఆర్ ఫై సెటైర్లు , విమర్శలు చేస్తుండడం తో..ఈరోజు పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కేటీఆర్..కీలక వ్యాఖ్యలు చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
రేపో మాపో పులి బయటకు వస్తది. వచ్చిన తర్వాత ఈరోజు ఎగిరెగిరి పడుతున్న నక్కలన్నీ మళ్లా తొర్రలకే పోతాయి. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి.. ఈరోజు ఎగిరెగిరి పడుతున్న నక్కలు, నీలుగుతున్న నక్కలు, మూలుగుతున్న తోడేండ్లు అన్ని మళ్లా తొర్రలకే పోతాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ ఏం ఏం చేయాలని కేసీఆర్ అన్ని లెక్కలు తీస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఎందుకంటే మనం ఏం మాట్లాడినా బాధ్యతతో మాట్లాడుతాం. వానిది ఏం పోయింది కాంగ్రెసోనిది. నెత్తి వాన్ది కాదు.. కత్తి వాన్ది కాదు.. ఎటువడితే అటు గీకుతాడు. గెలిచేది లేదు, పీకేది లేదు. ఎటువడితే అటు మాట్లాడుడే. కాంగ్రెస్‌ను నమ్మే బుద్ది తక్కువ పరిస్థితిలో మనం ఉన్నామా? 60 ఏండ్లు మనల్ని వేధించారు. ఈరోజు వచ్చి ప్రశ్నలు వేస్తుంటే గమ్మత్తు అనిపిస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ హయాంలో రూ. 200 పెన్షన్ ఇచ్చేటోళ్లు అని కేటీఆర్ గుర్తు చేశారు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం రూ. 75 పెన్షన్ ఇచ్చేది. ఇవాళ మీరంతా కేసీఆర్‌ను గెలిపించుకున్న తర్వాత 200 ఉన్న పెన్షన్ 10 రెట్లు పెరిగింది. రూ. 2 వేల పెన్షన్ అయింది. దివ్యాంగులకు పెన్షన్లు పెంచాం. కాంగ్రెస్ హయాంలో 29 లక్షల మందికి పెన్షన్లు వచ్చేవి. ఇప్పుడు 46 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి. బీడీలు చుట్టే అక్కాచెళ్లెళ్లు 16 రాష్ట్రాల్లో ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలోనైనా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నారా..? ఆ దిశగా ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా..? రెండున్నర లక్షల మంది ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇచ్చే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా..? అని కేటీఆర్ నిలదీశారు.
Read Also : Somireddy vs Kakani : వచ్చే ఎన్నికల్లో సోమిరెడ్డికి డిపాజిట్ దక్కదన్న మంత్రి కాకాణి