Site icon HashtagU Telugu

KTR Assets : నాకంటూ ఎలాంటి ఫామ్‌ హౌజ్ లేదు – కేటీఆర్

Ktr Clarity On Farmhouse

Ktr Clarity On Farmhouse

తన పేరుపై ఏ ఫామ్ హౌస్ (Farm House) లేదని కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టిన కట్టడాలను కూల్చేస్తు వస్తుంది. ఈ క్రమంలో కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా కూల్చేస్తారనే వార్తలు ఉపంచుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 111 జీవోను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన జన్వాడ ఫామ్ హౌస్ ను సైతం కూల్చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా ఫామ్ హౌస్ పై అందిన ఫిర్యాదులపై ఆయా ఫామ్ హౌస్ నిర్మాణాల కోసం ఏ ఏ శాఖల నుంచి అనుమతులు ఇచ్చారనే కోణంలో హైడ్రా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మీడియా లో అనేక కథనాలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

బ‌ఫ‌ర్ జోన్‌లోని కానీ, ఎఫ్‌టీఎల్‌లో కానీ త‌న‌కంటూ ఎలాంటి ఫామ్‌ హౌజ్ లేదని.. మీరు చెప్తున్న ఆ ఫామ్ హౌజ్ త‌న స్నేహితుడిది అని కేటీఆర్ స్పష్టం చేసారు.త‌న స్నేహితుడి ఫామ్ హౌజ్ ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లో ఉంటే నేనే దగ్గర్నుండి కూలగొట్టిస్తా. నో ప్రాబ్లం.. మంచి జ‌రుగుతున్న‌ప్పుడు అంద‌రం ఆహ్వానించాల్సిందే. కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఒక్క‌టే అడుగుతున్నాను. ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ల‌లో మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ నేత‌లు క‌ట్టిన రాజ‌భ‌వ‌నాల సంగ‌తి ఏంది..? నా స్నేహితుడి ఫామ్ హౌజ్‌ను మ‌రి జూమ్‌లు పెట్టి తీస్తున్నారు.. అవి సోష‌ల్ మీడియాలో క‌న‌బ‌డుతున్నాయి. కానీ చెరువుల్లో కట్టుకున్న మంత్రుల ఫామ్‌ హౌజ్‌ల సంగతి ఏంది..? చెరువుల్లో కట్టుకున్న బడా కాంగ్రెస్ నాయకుల ఫామ్‌ హజ్‌లు కూలగొట్టే దమ్ము హైడ్రాకు లేదా..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

ఎఫ్‌టీఎల్‌ పరిధిలో కట్టుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మధు యాష్కీ వీళ్ళందరి ఫామ్‌ హౌజ్‌ల దగ్గరికి వెళ్ళి కూలగొడదాం. వీరితో పాటు రేవంత్ రెడ్డిది కూడా ఫామ్ హౌస్ ఉంది. సీఎం ఫామ్ హౌజ్ గురించి శాటిలైట్ మ్యాప్‌ల‌ను కూడా మీడియాకు పంపిస్తాను చూసుకోండి. నా పేరు మీద ఫామ్ హౌజ్ం ఉన్న‌ట్లు మీడియాలో ఏవేవో క‌థ‌నాలు రాస్తున్నారు. కానీ స్ప‌ష్టంగా చెబుతున్నా.. నా పేరు మీద ఏ ప్రాప‌ర్టీ లేదు అని కేటీఆర్ స్పష్టం చేసారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ‘మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసి ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నందుకు సిగ్గులేదా? అక్రమ కట్టడాన్ని లీజుకు ఎలా తీసుకున్నావ్? దానికి అనుమతి ఇచ్చింది నువ్వే కదా? లీజుకు తీసుకున్నందుకు ఎన్ని డబ్బులు కట్టావ్? దమ్ముంటే ఆ బ్యాంక్ స్టేట్మెంట్లు బయటపెట్టు’ అని ట్వీట్ చేసింది.

Read Also : CBI : జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: కోర్టును కోరిన సీబీఐ