Site icon HashtagU Telugu

KTR : ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి.. బీఆర్‌ఎస్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటీఆర్‌ చురక

KTR To ED

KTR To ED

KTR : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరుగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో ఉపఎన్నికలు తప్పవని భావించిన బీఆర్‌ఎస్ వర్గాలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ రోజు ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించిన కేటీఆర్, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తే, బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అనివార్యం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుదారులను ఎంత ప్రయత్నించినా కాపాడలేదని, త్వరలోనే ఎన్నికల పరిస్థితులు తలెత్తుతాయని వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారంపై కేటీఆర్ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఇప్పటికే ఉన్న పిటిషన్లతో కలిపి విచారణ చేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించింది. అయితే, సోమవారం జరగాల్సిన విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కు వాయిదా వేసినట్లు కోర్టు వెల్లడించింది.

స్పీకర్ తీర్పును వేగవంతం చేయాలని కోర్టుకు వినతి
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ, జనవరి 29న కేటీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే కోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిరాయింపులపై వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా విచారణలో ఉంది. దీంతో, ఈ రెండు కేసులను కలిపి ఫిబ్రవరి 10న విచారించనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో, బీఆర్‌ఎస్ శ్రేణులు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచి, ఆపై అధికార కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు వీరే:

ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో, బీఆర్‌ఎస్ వీరిపై అనర్హత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. పార్టీ ఫిరాయింపులు, కోర్టు తీర్పు, స్పీకర్ నిర్ణయంపై వచ్చే రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తదుపరి పరిణామాలపై అన్ని వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

Beet Root: వామ్మో.. బీట్‌రూట్ జ్యూస్ తాగితే అన్ని రకాల ప్రయోజనాలా!