పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో రచ్చ లేపుతున్న సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి వంటి అంశాలపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో ఒకటో రెండో బాంబులు పేలబోతున్నాయన్నారు. తాము సియోల్‌లో ఉండగానో.. లేకపోతే హైదరాబాద్ వెళ్లిన మరుసటి రోజో పొలిటికల్ బాంబులు పేలే అవకాశముందని అన్నారు. ధరణి, కాళేశ్వరం, టెలిఫోన్ ట్యాపింగ్, ఇలా 10 అంశాల వారీగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై విచారణ చేపడుతున్నామన్నారు. తొందరపాటుకు ఏమాత్రం ఆస్కారం లేకుండా, కక్షపూరితమైన చర్యలకు పోకుండా సరైనా సాక్షాధానాలతో నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.
పొంగులేటి ఆలా అన్నారో లేదో..నెక్స్ట్ డే కేటీఆర్ (KTR) ఆదిలాబాదు లో జరిగిన సభలో తాను అరెస్టు కావడానికి రెడీ కానీ పోలీసు అధికారులకు మిత్తితో సహా చెల్లిస్తామని అన్నారు. దీంతో అంత పొంగులేటి చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ పైనే కావొచ్చు అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కేటీఆర్ కు సంబదించిన కీలక నిజాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి..కావొచ్చు అందుకే పరోక్షంగా పొంగులేటి అరెస్ట్ ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మరి నిజంగా కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా…? కేటీఆర్ కు సంబదించిన ఏ సాక్ష్యాలు వారి దగ్గర ఉన్నాయి..? అవి దేని గురించి అయ్యి ఉంటాయి..? అంటూ రకరకాలుగా అంత మాట్లాడుకోవడం చేస్తున్నారు. చూద్దాం మరి ఈ రెండు రోజుల్లో ఏంజరగబోతుందో..!!
Read Also : AP Free Gas Cylinders: ఉచిత గ్యాస్ సీలిండర్లపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..