Site icon HashtagU Telugu

Jeevan Reddy Comments : రేవంత్ ఇప్పటికైనా లెంపలేసుకుంటారా? – KTR

Ktr Revanth War

Ktr Revanth War

బిఆర్ఎస్ (BRS) నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే లపై వేటువేయాలని MLC జీవన్ రెడ్డి (Jeevan Reddy) చేసిన కామెంట్స్ పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ KTR స్పందించారు. ‘రేవంత్ గారు.. మీ సొంత పార్టీ నేతనే మీరు చేసిన MLAల ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్య అని సూటిగా వేలెత్తి చూపుతున్నారు. ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా? జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని మీ దిగజారుడు రాజకీయాలపై దుమ్మెత్తి పోశారు’ అని ట్వీట్ చేశారు.

తాజాగా జీవన్ రెడ్డి అనుచరుడ్ని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ , సొంత మనిషినే ఇలా దారుణంగా హత్య చేస్తుంటే ఇక ఎందుకు పార్టీ లో ఉండాలి అన్నట్లు జీవన్ రెడ్డి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మరోసారి తన ఆవేదనను చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయని , కాంగ్రెస్‌ విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి చేరిన వారిపై అనర్హత వేటు వేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఫిరాయింపులు మంచిది కాదని హైకమాండ్‌కు చెప్పానని పేర్కొన్నారు. ఇక దానిపై నిర్ణయం పార్టీ ఇష్టమేనని తెలిపారు. ఫిరాయింపులపై తన నిర్ణయం మాత్రం మారదని స్పష్టం చేశారు.

ఫిరాయింపుల కారణంగా బీఆర్‌ఎస్‌ ఎవరో.. కాంగ్రెస్‌ ఎవరో అర్థం కావడం లేదని జీవన్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అసలైన కాంగ్రెస్‌ నేతలు కూడా తాము కాంగ్రెస్సే అని చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉందని తెలిపారు. ఎంఐఎంను మినహాయించినా కాంగ్రెస్‌ సుస్థిరంగానే ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కోరారు. పార్టీ ఫిరాయిస్తే సస్పెండ్‌ చేయాలని చట్టంలోనూ ఉందని గుర్తుచేశారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.

అలాగే TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా జీవన్ రెడ్డి కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు. మ్మెల్యేలను చేర్చుకోవడం అనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయమని , పార్టీ నిర్ణయం ప్రకారమే మ్మెల్యేలను చేర్చుకున్నామన్నారు. దీని వల్ల MLC జీవన్ రెడ్డి ప్రతిష్ఠకు ఎక్కడా భంగం వాటిళ్లలేదని ఆయన అన్నారు.

Read Also : Prabhas Raja Saab : రాజ సింహాసనం మీద రాజా సాబ్.. ప్రభాస్ బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసిందోచ్..!