Site icon HashtagU Telugu

Bomb Threat Call: కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు.. తనిఖీ చేసిన అధికారులు

Train Luggage

Train Luggage

తిరుపతి-ఆదిలాబాద్ మధ్య నడుస్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు కాల్ (Bomb Threat Call) వచ్చింది. దీంతో హైదరాబాద్ నగర పోలీసులతో పాటు దక్షిణ మధ్య రైల్వే అధికారుల్లో భయాందోళన నెలకొంది. బాంబు సమాచారం అందిన వెంటనే రైలును తనిఖీ చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బోగీలను తనిఖీ చేశారు. సమగ్ర విచారణ అనంతరం బాంబు కాల్ ఫేక్ అని తేలింది. అయితే ముందుజాగ్రత్త చర్యగా రైలులోని అన్ని బోగీలను తనిఖీ చేయగా అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు కాల్ వచ్చినట్లు పుకార్లు వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Also Read: Four Died: కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

మౌలాలీ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులతో వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే రైల్వే పోలీసులు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో కలిసి రైలు మొత్తం తనిఖీ చేయగా కాల్ ఫేక్ అని తేలింది. మౌలాలీ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులతో నిలిచిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలుకు రైల్వే శాఖకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే రైల్వే పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో కలిసి ఎక్స్‌ప్రెస్ మొత్తం తనిఖీ చేయగా కాల్ ఫేక్ అని తేలిందని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version