Konda Vishweshwar Reddy : పార్టీ గెలిచే పరిస్థితిలో లేదు.. బీజేపీపై సొంత పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు..

చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశారు రెడ్డి ఇటీవల కొన్నాళ్ల క్రితం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ పార్టీ మారబోతున్నారని వార్తలు వస్తుండటంతో...

  • Written By:
  • Publish Date - September 27, 2023 / 08:30 PM IST

తెలంగాణలో ఎలక్షన్స్(Telangana Elections) జోరు మొదలైంది. పార్టీలు నేతలని ప్రకటిస్తున్నారు. ప్రచారం మొదలుపెట్టారు. ఒక పార్టీపై మరో పార్టీ ఫైర్ అవుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్(BRS) ముందు నుంచి దూకుడుగా వెళ్తుంది. ఇక కాంగ్రెస్(Congress) కి ఈ మధ్య జోష్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ముందు నుంచు దూకుడుగా ఉన్న బీజేపీ(BJP) మాత్రం ఇటీవల నెమ్మదించింది.

గతంతో పోలిస్తే ఇప్పుడు తెలంగాణాలో బీజేపీ జోష్ తగ్గింది. సొంత పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని ఒప్పుకోక తప్పడం లేదు. పలువురు బీజేపీ నాయకులు అయితే పార్టీ మారుతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశారు రెడ్డి ఇటీవల కొన్నాళ్ల క్రితం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ పార్టీ మారబోతున్నారని వార్తలు వస్తుండటంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ వార్తలని ఖండించారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) మీడియాతో మాట్లాడుతూ.. నేను కొంతమంది నేతలను కలుస్తున్న మాట నిజమే. మేము రెగ్యులర్ గా కలుస్తాం. ఇందులో రహస్యం ఏమి లేదు. మా మధ్య మంచి స్నేహం ఉంది. అంతే కాని నేను పార్టీ మారుతున్నాను అనే మాటలో వాస్తవం లేదు. నేను పార్టీ మారడం లేదు. పార్టీ ప్రస్తుతం గెలిచే పరిస్థితి లేదు. గెలవడానికి కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి. దీనిపై ప్రకాష్ జవదేకర్ తో కలసి మాట్లాడాం. ఇటీవల కొన్ని సర్వే లు చేసాము, ఇందులో 60 శాతం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉంది. దీనిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. వింయియోగించుకున్న పార్టీ గెలుస్తుంది. మా నాయకులంతా ఒక్కొక్కరు ఒక్కో ఏరియాలో పని చేయాల్సిన అవసరం ఉంది అని అన్నారు.

 

Also Read : Telangana : తెలంగాణను నియంత పరిపాలిస్తున్నాడని కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు..