Konda Surekha: మంత్రి కొండా సురేఖకు డెంగ్యూ జ్వరం

అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో మంత్రికి జ్వరం వచ్చింది. దీంతో మంత్రిత్వ శాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు.

Konda Surekha: అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో మంత్రికి జ్వరం వచ్చింది. దీంతో మంత్రిత్వ శాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు.

గత 5 రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో వైద్యులు పలుమార్లు వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం మంత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు .ఆమె జ్వరంతో బాధపడుతున్నప్పటికీ మంత్రి రోజువారి పనులను పర్యవేక్షిస్తున్నారు. మేడారం జాతర పురోగతి, ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండు మూడు రోజుల్లో కోలుకుని మేడారం సమ్మక్క సారక్క జాతరలో కొండా సురేఖ పాల్గొననున్నారు

Also Read: IND vs ENG: ధోనీని గుర్తు చేసిన టీమిండియా వికెట్ కీపర్