Komatireddy: ఠాక్రే కు ‘కోమటిరెడ్డి’ షాక్.. గాంధీభవన్ కు దూరం!

కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి తగ్గేదేలే అంటూ (Komatireddy Venkat Reddy) కొత్త బాస్ కూ తేల్చి చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
Komati Reddy

Komati Reddy

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్టైలే వేరు. తాను ఏదైనా నిర్ణయానికి కట్టుబడి ఉంటే.. తగ్గేదేలా అంటూ వ్యవహరిస్తారు. రాహుల్ గాంధీ అయినా, కొత్త బాస్ ఠాక్రే అయినా తన పంథాను ఏమాత్రం మార్చుకోరు. తాజాగా కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy) షాక్ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) పార్టీకి ఇన్ చార్జిగా నియమితులైన‌ సీనియర్ ఏఐసీసీ నాయకులు మాణిక్ రావ్ ఠాక్రే తొలిసారిగా హైదరాబాద్ వచ్చారు. పార్టీ నేతలందరితో విడి విడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలతో ఆయన చర్చలు జరిపారు. వారి వాదనలు విన్నారు.

ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి (Komatireddy Venkat Reddy) వెంకట్ రెడ్డికి ఫోన్ చేసి గాంధీ భవన్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. కోమటి రెడ్డి పిర్యాదులపై అక్కడే చర్చిద్దామని మాణిక్ రావ్ సూచించారు. అయితే మాణిక్ రావ్ ఠాక్రే ఆహ్వానాన్ని కోమటి రెడ్డి తిరస్కరించారు. తాను గాంధీ భవన్ లో అడుగుపెట్టబోనని తేల్చి చెప్పారు. తనతో మాట్లాడాలని అనుకుంటే బయట ఎక్కడైనా సరే కలవడానికి తాను సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు. వెంకట రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) బీజేపీలో చేరినప్పటి నుంచి వెంకటరెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు.

ముఖ్యంగా మునుగోడు ఉప‌ ఎన్నిక సమయం నుండి ఆయన పార్టీకి పూర్తిగా దూరంఅయ్యారు. ఈ మధ్య కాలంలో వెంకట రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోడీతో సమావేశం కూడా అయ్యారు. ఆయన త్వరలోనే బీజేపీ (BJP)లో చేరబోతున్నారనే వాదనలు వినిపిస్తున్న ఈ తరుణంలో ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే ఆయనను పిలవడం చ‌ర్చనీయాంశమైంది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేతలు గాంధీభవన్ లో కలిసికట్టుగా కనిపించినా కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy) మాత్రం దూరంగా ఉండటం మరోసారి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Modi Tour Postponed: మోడీ ‘తెలంగాణ’ పర్యటన వాయిదా!

  Last Updated: 11 Jan 2023, 02:46 PM IST