Komatireddy: తెలంగాణ విజయాన్ని సోనియాగాంధీకి బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నాం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోతోంది.

Published By: HashtagU Telugu Desk
Komatireddy Venkatreddy, nalgonda

Komatireddy Venkatreddy

Komatireddy Venkat Reddy: తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు ఇతర అభ్యర్థుల కంటే ముందున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఐదేళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎంతగానో కష్టపని చేశారని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఎంతగానో కష్టపడ్డారని ఆయన అన్నారు. ఈ ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గొడవలు ఉండబోవు అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ విజయాన్ని సోనియాగాంధీకి బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నామని ఆయన అన్నారు. కాగా సీఎం రేసులో ఎవరు ఉన్నారనే విషయమై కోమటిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం సీఎం పోస్టుకు ఎవరికి దక్కతుంది అనేది అప్రస్తుతమని కోమటిరెడ్డి అన్నారు. వచ్చే ఐదేళ్లలో సమర్థవంతమైన పాలన అందిస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ 1946 డిసెంబరు 9న జన్మించారు సోనియా. దశాబ్ద కాలంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సోనియా అధ్యక్షురాలిగా వ్యవహరించారు. అయితే తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని గుర్తించిన సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును గుర్తించి, ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా దూసుకెళ్తుండటంతో కోమటిరెడ్డితో పాటు ఇతర నేతలు సోనియాగాంధీకి బర్త్ డే గిఫ్టుగా ఇస్తున్నామని సంతోషంతో చెబుతున్నారు.

Also Read: Komatireddy: సోనియాగాంధీకి బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నాం: కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  Last Updated: 03 Dec 2023, 12:59 PM IST