Site icon HashtagU Telugu

Komatireddy Raj Gopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ‘ఆ శాఖ ‘పై కోరిక

Komatireddy Raj Gopal Reddy

Komatireddy Raj Gopal Reddy

తెలంగాణలో కేబినెట్ విస్తరణ(Cabinet expansion)కు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యంగా ఆరు ఖాళీ ఉన్న మంత్రి పదవుల్లో నాలుగు పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం చూస్తుంది. ఈ క్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) పేరు మంత్రి పదవి రేసులో బలంగా వినిపిస్తోంది. ఆయనకు మంత్రి పదవి దక్కడం ఖాయమని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుండగా తాజాగా తనకు హోంశాఖ అంటే ఇష్టమని స్వయంగా వెల్లడించారు. అయితే ఏ శాఖ వచ్చినా సమర్థవంతంగా పనిచేసే బాధ్యతను తీసుకుంటానని స్పష్టం చేశారు.

Joint Pains: కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ సూపర్ డ్రింక్స్ తాగాల్సిందే!

కేబినెట్ విస్తరణకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో చర్చలు ముగిసినట్టు సమాచారం. సామాజిక సమతుల్యాన్ని దృష్టిలో ఉంచుకొని, బీసీ, ఎస్సీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాలకు ఒక్కో మంత్రి పదవి కేటాయించే అవకాశం ఉంది. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హోంశాఖను కోరడం ఆసక్తిగా మారింది. కానీ కాంగ్రెస్ అధిష్ఠానం దీనిపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. కాగా కేబినెట్ విస్తరణలో కొన్ని శాఖల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొంత మంది ప్రస్తుత మంత్రుల శాఖలను మార్చే అవకాశం ఉండగా, ఒక ఇద్దరు మంత్రులను కేబినెట్ నుంచి తప్పించే విషయమై కూడా చర్చ జరుగుతోందని తెలుస్తోంది.

ఈ పరిణామాల మధ్య మంత్రి పదవి ఆశిస్తున్న కొంతమందికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ వంటి ఇతర హోదాలను కేటాయించనున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి ఎస్టీ లంబాడ వర్గానికి కేటాయించే యోచనలో అధిష్ఠానం ఉంది. చీఫ్ విప్ పదవి బీసీ లేదా మాదిగ సామాజికవర్గానికి ఇచ్చే అవకాశం ఉంది. ఉగాది పండుగ నాటికి కేబినెట్ విస్తరణ ఖరారు కావచ్చని సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హోంశాఖ దక్కుతుందా లేదా అనేది త్వరలోనే తేలనుంది.