Keshava Rao : ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా కేశవరావు..?

కేశవరావు ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక సలహాదారుగా వాడుకోవాలని చూస్తుందా

Published By: HashtagU Telugu Desk
Kk As Government Advisor

Kk As Government Advisor

సీనియర్ నేత కేశవరావు ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక సలహాదారుగా వాడుకోవాలని చూస్తుందా..? అంటే అవుననే అంటున్న కాంగ్రెస్ వర్గాలు. సీనియర్ రాజకీయ నేత, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు (K. Keshava Rao ) కాంగ్రెస్ (Congress) పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. బుధువారం సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన.. తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌మున్షీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఖర్గే. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.

We’re now on WhatsApp. Click to Join.

బీఆర్ఎస్ హయాంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయితే కేసీఆర్ విధివిధానాలు నచ్చక ఆయన తిరిగి సొంతగూటికి వచ్చారు. బిఆర్ఎస్ లో కేకే కు కీలక బాధ్యత అప్పగించారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. పార్టీ సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన ఆయన.. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి ఆయన్ను మరింతగా వాడుకోవాలని రేవంత్ చూస్తున్నాడు. కేశవరావును ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు సమాచారం. ఆయనకు ఉన్న రాజకీయ, పరిపాలనాపరమైన అనుభవాలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటె తన రాజ్యసభ సభ్యత్వానికి గురువారం కేకే రాజీనామా చేసారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు రాజీనామా అందజేశారు. 2020 సెప్టెంబర్‌లో కేకే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Read Also : Vijay Devarakonda : శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ..!

  Last Updated: 04 Jul 2024, 11:14 PM IST