తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కిషన్ రెడ్డి ఉదయం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి, నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీగా తరలివస్తారు. అనంతరం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ వర్గాల సమాచారం. చార్మినార్ వద్ద ఆయనతో పాటు వందలాది మంది పార్టీ కార్యకర్తలు పాల్గొంటారని భావిస్తున్నారు.
అంబర్‌పేట్‌లోని జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. బషీర్‌బాగ్‌లోని కనకదుర్గామాత ఆలయాన్ని సందర్శించి, ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించి పూలమాల వేసి, పార్టీ కార్యాలయానికి వెళ్లే ముందు శాసనసభ సమీపంలోని అమరవీరుల స్మారకానికి చేరుకుంటారు. వర్షం కురుస్తున్నప్పటికీ రాష్ట్ర పార్టీ నేతలు ర్యాలీని గ్రాండ్‌గా సక్సెస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొననున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రానున్న నెలల్లో పార్టీ షెడ్యూల్డ్ కార్యక్రమాలను తెలియజేయడానికి కొత్త పార్టీ అధ్యక్షుడు పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జులై 25న ఇందిరాపార్క్, ధర్నా చౌక్ వద్ద నిరసన ప్రదర్శనకు పార్టీ కొత్త అధినేత నాయకత్వం వహిస్తారు.
Also Read: Harish Rao: తెలంగాణలో మరో కొత్త పథకం.. త్వరలో మైనార్టీ బంధు